తన భార్యపై వెకిలి కామెంట్స్ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభంలో తన భార్య, బిడ్డల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ, వారి కోసమైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానన్నాడు మణికంఠ. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అతనిపై ఎమోషనల్ స్టార్, సింపతీ స్టార్ గా ముద్ర పడిపోయింది. అయితే ఏమైందో ఏమో గత వారంలో ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండలేనన్నాడు మణికంఠ.
ఇంటికి వెళ్లిపోతానంటూ బోరున ఏడ్చేశాడు. ‘ఆరోగ్యం బాగోలేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి మహా ప్రభో’ అని వేడుకోవడంతో నాగార్జున మణికంఠను బయటకు పంపించేశాడు. మణికంఠ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అతని భార్య ప్రియపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కొందరు నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. వెకిలి కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మట్లాడుతున్నారు. ఈ క్రమంలో బయటికి వచ్చిన మణికంఠ తన భార్యను ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ పై ఘాటుగా రియాక్టయ్యాడు. తన సతీమణి ప్రియపై వస్తోన్న వెకిలి కామెంట్స్ పై స్పందించిన మణికంఠ.. బిగ్‌బాస్‌కు ముందు ప్రతి చిన్నదాన్నీ పట్టించుకునేవాడిని, బాధపడేవాడినని,.. కానీ ఇప్పుడు ఇలాంటి నెగెటివ్ కామెంట్లను అస్సలు లెక్క చేయడం లేదంటూ చెప్పాడు. తన పెళ్లి వీడియో వైరలయినప్పుడు కూడా తన భార్య ప్రియపై అసభ్యకర కామెంట్లు చేశారని.. అలాంటి కామెంట్స్ చేసే వారికి కాస్తయినా జ్ఞానం ఉండాలని సీరియస్ అయ్యాడు. తెలివితక్కువవాళ్లు ఇలాంటి పనికిమాలిన పనే చేస్తూ ఉంటారన్నాడు. తన భార్య తనకు అందగత్తె అని.. ఆమె మనసు ఎంతో అందమైనది అని చెప్పాడు. తనను బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లే భరించలేకపోయారని.. కానీ తను జీవితాంతం తనను భరిస్తోందన్నాడు మణికంఠ. అంతేకాదు తను చాలా గొప్పదని.. దయచేసి ఆమెపై వెకిలి కామెంట్స్ చేయవద్దంటూ ..ట్రోలర్స్‌ను రిక్వెస్ట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్ ప్రశంసలు
42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??