Ram Charan: రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న చరణ్.. టాలీవుడ్‌లో ఇంత కాస్ట్రీ వెహికల్ మరెవరికీ లేదట !!
పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు.కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. తనదైన నటనతో విమర్శకులను మెప్పించాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగులో టాప్ నటుల్లో ఒకరిగా ఎదిగారు. సినిమాల్లో నటించడమే కాకుండా... మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు కావాల్సింది ఏదైనా.. దక్కించుకునే రేంజ్‌కు ఎదిగాడు.
ఇక ఈక్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ కొన్నాడట. టాలీవుడ్‌లో ఇంత ఖరీదైన లగ్జరీ కారు మరెవరికీ లేదట. కార్లంటే చాలా ఇష్టపడే రామ్ చరణ్.. తాజాగా రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను కార్‌ను కొనుగోలు చేశారట. ఈ కారు ధర దాదాపు 7.50 కోట్ల రూపాయలు. ఇక ఈ స్పెక్టర్ కారు రోల్స్ రాయిస్ లోని ఇతర కార్ల కంటే డిజైన్, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటుంది. ఇక ఇప్పటికే చరణ్ గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు.. విమానయాన పరిశ్రమలో రామ్ చరణ్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రామ్ చరణ్ సినిమా నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
42 ఏళ్ల వయసు అమ్మాయితో.. అభిషేక్ బచ్చన్ ప్రేమకలాపం ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

