AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షవర్ బాత్ చేస్తున్నారా? సమ్మర్‌‌లో చేసే అలవాటుంటే ఈ విషయాలు తెలుసా

చాలా రోజుల వరకూ ఉపయోగంలో లేని షవర్‌ హెడ్‌లలో ప్రాణాంతకమైన హానికర బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో చాలా ఇళ్లల్లో రెగ్యులర్‌గా షవర్‌ బాత్‌ చేయడం చాలా అరుదు. కేవలం ఎప్పుడో ఓసారి.. అదికూడా ఎండలు ఎక్కువగా ఉండే వేసవిలోనే దీని కింద స్నానం చేస్తుంటారు. దాంతో, చాలారోజులు వాడకుండా ఉండే షవర్‌ హెడ్‌ లోపల ‘బయోఫిల్మ్‌’ అనే ఒక ప్రమాదకరమైన పొర పేరుకుపోతుంది.

షవర్ బాత్ చేస్తున్నారా? సమ్మర్‌‌లో చేసే అలవాటుంటే ఈ విషయాలు తెలుసా
Shower Bath
Nikhil
|

Updated on: May 20, 2026 | 6:15 AM

Share

వేసవి కాలం రాగానే ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది షవర్‌ బాత్‌ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు బాత్రూమ్‌లో పైనుంచి పడే చల్లని నీటి జల్లుల్లో కేరింతలు కొడుతూ ఎక్కువ సమయం స్నానాలు చేస్తుంటారు. అయితే, అందరికీ ఎంతో ఇష్టమైన ఈ షవర్‌ హెడ్‌లోనే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయోఫిల్మ్ అంటే మరేమిటో కాదు.. ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), మరియు ఇతర కంటికి కనిపించని సూక్ష్మజీవులు అన్నీ కలిసి అక్కడ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఒక జిగురులాంటి పదార్థాన్ని విడుదల చేస్తూ పైపులు, షవర్‌ హెడ్స్‌ లోపలి భాగంలో గట్టిగా అతుక్కుని ఉంటాయి.

చాలా రోజుల తర్వాత మనం హఠాత్తుగా షవర్‌ ఆన్‌ చేసినప్పుడు.. నీటితోపాటుగా ఈ పొర నుంచి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కూడా బయటికి వస్తాయి. మనం స్నానం చేసే క్రమంలో అవి నీటి బిందువులతో కలిసి నోరు, ముక్కు, చెవుల గుండా మన శరీరంలోకి చాలా సులభంగా ప్రవేశిస్తాయి. దీనివల్ల చర్మ సంరక్షణ దెబ్బతినడమే కాకుండా లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

శ్వాసకోశ సమస్యల నుండి చర్మ వ్యాధుల వరకు!

ఈ బయోఫిల్మ్ బ్యాక్టీరియా కారణంగా శరీరంలోకి ఇన్ఫెక్షన్లు చేరి శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలిక దగ్గు, తీవ్రమైన అలసట, న్యుమోనియా మరియు స్కాల్ప్‌ (తల చర్మం) ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కొన్నిరకాల మురికి బ్యాక్టీరియాలు చర్మంపై పేరుకుపోవడం వల్ల దద్దుర్లు, విపరీతమైన దురద, మరియు కళ్లలో మంటలతో ఇబ్బంది పెడతాయి. కేవలం షవర్‌ మాత్రమే కాదు.. కొన్నిరోజుల పాటు ఉపయోగించని నీటి నల్లాల్లోనూ (ట్యాప్స్) ఈ రకమైన బయోఫిల్మ్‌ ఏర్పడుతుంది. ఉదాహరణకు వారం రోజులు ఎటైనా ఊరికి వెళ్లి, మళ్లీ ఇంటికి వచ్చి ట్యాప్ ఆన్‌ చేసినప్పుడు.. ఆ పైపుల్లో వృద్ధి చెందిన బ్యాక్టీరియా మొత్తం మనం పట్టే బకెట్‌లోకి వచ్చేస్తుంది. ఆ నీటిని మనం గమనించకుండా స్నానానికి లేదా ముఖం కడుక్కోవడానికి వాడినప్పుడు అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి.

శుభ్రతతోనే ఆరోగ్యం..

వెచ్చని, తేమతో కూడిన ప్లంబింగ్‌ వాతావరణం అనేది సూక్ష్మజీవుల వేగవంతమైన పెరుగుదలకు, వ్యాధికారకాల వ్యాప్తికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, నల్లాలు మరియు షవర్‌ హెడ్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా ఈ ముప్పు నుండి తప్పించుకోవచ్చు. ఇందుకోసం నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను సూచిస్తున్నారు.

  • షవర్‌ హెడ్స్‌ను నెలకోసారైనా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్లాస్టిక్‌ కవర్లో వెనిగర్‌ నింపి, దానిని షవర్‌ హెడ్‌ మునిగేలా తగిలించి రాత్రంతా అలాగే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయం చూస్తే లోపల ఉన్న మురికి, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయి.
  • ప్లాస్టిక్‌ షవర్‌ హెడ్స్‌కు బదులుగా, మంచి మెటల్‌ హెడ్స్‌ వాడటం చాలా మంచిది. ఎందుకంటే ప్లాస్టిక్‌పై బ్యాక్టీరియా పొరలు చాలా త్వరగా ఏర్పడతాయి.
  • స్నానం చేయడానికి ముందు కనీసం ఒక నిమిషంపాటు షవర్‌ లేదా ట్యాప్ నీటిని వృథాగా కిందకు వదిలేయాలి. దీనివల్ల పైపుల్లో నిలిచి ఉన్న పాత నీరు, బ్యాక్టీరియా కొట్టుకుపోతాయి.
  • బాత్రూమ్‌లో ఎప్పుడూ తేమ ఉండకుండా చూడాలి. స్నానం ముగించిన తర్వాత బాత్రూమ్‌ కిటికీలు తెరిచి ఉంచాలి లేదా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ ఆన్‌ చేయడం ద్వారా లోపల తడి ఆరిపోయేలా చూసుకోవాలి.

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి షవర్ బాత్ మంచి మార్గమే అయినప్పటికీ, ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోతే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసినట్లవుతుంది. టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలను వాడుకుంటూనే, వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ సింపుల్ కేర్ తీసుకుంటే మీ కుటుంబ సభ్యులు మరియు పిల్లలు ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా వేసవి సెలవులను సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.

Follow Us