నిమ్మకాయలతో ఇన్ని లాభాలా.. మీరు తెలుసుకోవాల్సిన సూపర్ సీక్రెట్స్ ఇవే

Krishna

19 May 2026

మనం మార్కెట్‌లో నిమ్మకాయలు కొనేటప్పుడు వాటి తొక్కను తప్పకుండా గమనించాలి. పలుచటి తొక్కఉన్న నిమ్మకాయలను ఎంచుకుంటే, వాటిలో సాధారణం కంటే చాలా ఎక్కువ రసం ఉంటుంది.

ఎక్కువ రసం

చాలామంది నిమ్మకాయలు తెచ్చిన వెంటనే నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ నిమ్మకాయలను ఎల్లప్పుడూ గిన్నెడు నీటిలో నానబెట్టి ఉంచడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. లోపల రసం కూడా బాగుంటుంది.

ఫ్రిజ్‌లో పెట్టడం

గట్టిగా ఉన్న నిమ్మకాయల నుండి రసం తీయడం కాస్త కష్టమైన పని. అలాంటి సమయంలో నిమ్మకాయను ఒక 15 సెకన్ల పాటు మైక్రోవేవ్‌లో ఉంచి లైట్‌గా వేడి చేయాలి. దీనివల్ల రసం ఎక్కువగా వస్తుంది.

మైక్రోవేవ్ ట్రిక్‌

ఒకవేళ మీ ఇంట్లో మైక్రోవేవ్ లేకపోయినా నిమ్మకాయను సులభంగా మెత్తగా చేయచ్చు. నిమ్మకాయను చేతితో గట్టిగా ఫ్లోర్‌పై రబ్ చేయడం వల్ల దాన్ని లోపలి భాగం లూజ్ అయి రసం బాగా వస్తుంది.

 మైక్రోవేవ్ లేకపోతే

నిమ్మరసం పిండేసిన తర్వాత మిగిలిపోయే తొక్కలను డస్ట్‌బిన్‌లో పడేసే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఆ తొక్కలలో అద్భుతమైన క్లీనింగ్ గుణాలు దాగి ఉంటాయి.

నిమ్మ తొక్కలు

వాడేసిన నిమ్మకాయ తొక్కలను వెనిగర్ కలిపిన నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఈ నీటిని చల్లార్చి ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే, ఇల్లు మెరిసిపోయేలా చేసే అద్భుతమైన హోమ్‌మేడ్ క్లీనర్ రెడీ అవుతుంది.

నాచురల్ క్లీనర్

నిమ్మరసం-వెనిగర్ మిశ్రమాన్ని ఉపయోగించి వంటగది స్లాబ్‌లు, జిడ్డు పట్టిన స్టవ్‌లు, మురికిగా మారిన అద్దాలను ఎలాంటి రసాయనాలు లేకుండా చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

కిచెన్ జిడ్డు

కేవలం ఆహారానికి రుచిని అందించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో నిమ్మకాయ ఒక సర్వగుణ సంపన్నమైన వస్తువుగా ఉపయోగపడుతుందని చెఫ్ పంకజ్ భదౌరియా స్పష్టం చేశారు.

 సర్వగుణ సంపన్నం