Actress Sreevani: ‘రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త’.. యాక్సిడెంట్ గురించి చెబుతూ నటి ఎమోషనల్.. వీడియో

‘చంద్రముఖి’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీవాణి. ఇందులో ఆమె అభినయం బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు పలు టీవీషోస్ లోనూ సందడి చేస్తుంది శ్రీవాణి. విక్రమాదిత్యను ప్రేమ వివాహం చేసుకున్న శ్రీవాణికి నందిని అనే కూతురు ఉంది.

Actress Sreevani: 'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. యాక్సిడెంట్ గురించి చెబుతూ నటి ఎమోషనల్.. వీడియో
Actress Sreevani
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2024 | 9:35 PM

ప్రముఖ బుల్లితెర నటి శ్రీవాణి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో చీరాల బీచ్ కి వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్నా కారు ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీవాణికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరులోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయాన్ని శ్రీవాణి భర్త విక్రమాదిత్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీవాణి క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిందీ అందాల తార. ఈ సందర్భంగా తన క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ‘నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు నాకు చికిత్స చేయకుండా మరీ నీచంగా చూశారు. ఇది యాక్సిడెంట్ కేసు కావడంతో ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ చెప్పిన ఆన్సర్ మాకు కోపం తెప్పించింది. కనీసం ఆస్పత్రిలో నాకు ప్రథమ చికిత్స కూడా అందించకుండా అలానే చూస్తూ ఉన్నారు. దీంతో ఎలాగోలా వేరే హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అక్కడ ముఖం మీద కట్ అయిన భాగానికి 20 కుట్లు వేశారు. అంతేకాదు నన్ను బాగా కూడా చూసుకున్నారు. ఇక నా రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి’

‘ ఈ క్లిష్ట సమయంలో ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు నాకు ఫోన్ చేశారు. నా క్షేమ సమాచారాల గురించి అడిగారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నాను. కానీ రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త విక్రమాదిత్య పిచ్చోడయిపోయాడు’ అంటూ శ్రీవాణి ఎమోషనలైంది. ఇక నటి భర్త విక్రమ్ మాట్లాడుతూ.. అసలు శ్రీవాణి లేకపోతే ఎలా బతకాలో నాకు తెలియదు. నందిని (కూతురు)ని ఎలా చూసుకోవాలో కూడా అర్థం కాలేదు. శ్రీవాణి నన్ను ఒక కొడుకులా చూసుకుంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిఇ చూసిన అభిమానులు, నెటిజన్లు శ్రీవాణి త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి ముందు బతుకమ్మ వేడుకల్లో నటి శ్రీవాణి.. వీడియో

యాక్సిడెంట్ తర్వాత మొదటి సారి మాట్లాడాలని…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.