AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 16: రతన్ టాటాని గుర్తు చేసుకున్న బిగ్ బీ.. లండన్ లో అమితాబ్ ని డబ్బులు అడిగిన రతన్ టాటా.. ఎందుకంటే..

వ్యాపారవేత్త రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా మరణించీ చిరంజీవి. రతన్ టాటా గొప్ప మనసు, సహకారం ప్రతి ఒక్కరి జీవితాంతం గుర్తుండిపోతుంది. తాజాగా అమితాబ్ బచ్చన్ ఒక షోలో రతన్ టాటా గురించి ఒక ఉదంతాన్ని వివరించారు. లండన్‌లో తనని రతన్ టాటా అప్పు అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

KBC 16: రతన్ టాటాని గుర్తు చేసుకున్న బిగ్ బీ.. లండన్ లో అమితాబ్ ని డబ్బులు అడిగిన రతన్ టాటా.. ఎందుకంటే..
Amitabh Bachchan On Ratan Tata
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 11:37 AM

Share

బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొన్నిసార్లు తన సినిమాలకు సంబంధించిన విషయాలను, మరి కొన్నిసార్లు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతూ ఉంటాడు. ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే షోకి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ బిగ్ బి ముందు హాట్ సీట్‌లో కూర్చున్నారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఒక పాత కథ చెప్పాడు. లండన్‌లో రతన్ టాటాతో తన సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. అమితాబ్ బచ్చన్‌ను డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగిన విషయం చెప్పారు.

వ్యాపారవేత్త రతన్ టాటా 86 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా గొప్ప మనసుని, అతని సహకారాన్ని నేటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. నిజానికి రతన్ టాటా, అమితాబ్ బచ్చన్ మధ్య మంచి అనుబంధం ఉంది. రతన్ టాటా ‘ఐత్‌బార్’ చిత్రానికి సహ నిర్మాత కూడా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. అయితే లండన్‌లో ఉన్న అమితాబ్ బచ్చన్‌ని రతన్ టాటా ఎందుకు డబ్బులు అడిగారో తెలుసా..!

ఇవి కూడా చదవండి

రతన్ టాటా అమితాబ్‌ను ఎందుకు డబ్బు అడిగారంటే

KBC 16 కొత్త ఎపిసోడ్‌లో బోమన్ ఇరానీ, ఫరా ఖాన్ రాబోతున్నారు. సోనీ టీవీ ఈ షోకి సంబంధించిన చిన్న ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రోమోలో బిగ్ బి  అమితాబ్ .. రతన్ టాటాతో ఉన్న అనుబంధం గురించి ఒక కథను పంచుకోవడం కనిపిస్తుంది. తాను రతన్ టాటా ఎటువంటి వ్యక్తి అనే విషయం చెప్పలేనని… ఎందుకంటే అతను సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తీ అని అన్నారు. అంతేకాదు ఒకసారి రతన్ టాటా తానూ ఒకసారి ఒకే విమానంలో లండన్ వెళ్లామని చెప్పారు. అక్కడ అంటే విమానాశ్రయంలో జరిగిన సంఘటనను గురించి కూడా ప్రస్తావించారు అమితాబ్. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే రతన్ టాటా తనను పికప్ చేసుకునెందుకు వచ్చిన వారిని చూసినట్లు లేదు. దీంతో వారికి ఫోన్ చేయడానికి రతన్ టాటా ఫోన్ చేయడానికి ఫోన్ బూత్‌కి వెళ్ళారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఆ సమయంలో తాను కూడా విమానాశ్రయం వెలుపల నిలబడి ఉన్నట్లు అమితాబ్ చెప్పారు. అయితే కొంత సమయం తరువాత రతన్ టాటా తన దగ్గరకు వచ్చి..  అమితాబ్.. నాకు కొంత డబ్బులు కావాలి అని అడిగారని తెలిపారు.

అంతేకాదు తనకు రతన్ టాటా కు మధ్య ఎన్నో ఇలాంటి సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఒకసారి  స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాము.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలుదేరుతుంటే .. ఇంతలో రతన్ టాటా.. తన దగ్గరకు వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నానని అడిగారు.. అని చెబుతూ అసలు రతన్ టాటా తన వద్ద కారు లేదని చెప్పడాన్ని ఎవరైనా  ఊహించగలరా అంటూ రతన్ టాటా సింపుల్ లివింగ్ గురించి గుర్తు చేసుకున్నారు అమితాబ్

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి