Diwali 2024: ఏడాదిలో దీపావళి రోజున తెరచుకునే అమ్మవారి ఆలయం.. ఏడాది పొడవునా వెలిగే దీపం, తాజాగా ఉండే పువ్వులు..
భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటి గొప్ప నిర్మాణంతో పాటు వాటిలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అనేక ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో దీపావళి రోజున మాత్రమే తలుపులు తెరుచుకునే ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలో నేటికీ ఒక రహస్యం ఉంది. ఆ ఆలయంలో వెలిగించిన దీపం ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుంది. అంతేకాదు భగవంతుడికి సమర్పించిన పువ్వులు కూడా ఏడాది పాటు తాజాగా ఉంటాయి.
భారతదేశాన్ని దేవాలయాల దేశం అంటారు. ఇక్కడ అనేక అద్భుతమైనం, రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ ఆలయాలు వాటి రహస్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అన్త్కాడు ఇక్కడ జరిగే అద్భుతాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ రోజు అలాంటి ఒక రహస్యాన్ని దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం తలపులు దీపావళి సమయంలో మాత్రమే తెరచుకుంటాయి. దేవుడి ముందు వెలిగించిన దీపం, ఆలయంలో దేవుడికి సమర్పించిన పువ్వులు కూడా ఒక సంవత్సరం తర్వాత దీపం వెలుగుతూనే ఉంటుంది. పువ్వులు కూడా తాజాగా ఉంటాయి.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో బెంగుళూరు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని హాసనాంబ దేవాలయం అంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. పూర్వం దీనిని సిహమసన్‌పురి అని పిలిచేవారు. ఇది చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం ఇతర దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది.
ఏడాది పొడవునా వెలిగే దీపం
దీపావళి సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీపావళి సందర్భంగా 7 రోజులు మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరుస్తారని చెబుతారు. ఆలయ తలుపులు తెరిచినప్పుడు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జగదంబను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఈ దేవాలయం తలుపులు మూసిన రోజున ఆలయ గర్భగుడిలో స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగిస్తారు. అలాగే ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించి బియ్యంతో చేసిన వంటలను ప్రసాదంగా సమర్పిస్తారు. ఏడాది తర్వాత మళ్లీ దీపావళి రోజున గుడి తలుపులు తెరిస్తే దీపాలు వెలుగుతూనే ఉంటాయని, పువ్వులు కూడా వాడిపోవని స్థానికులు చెబుతున్నారు.
7 రోజుల పాటు జరిగే పండుగ
దీపావళి సందర్భంగా హాసనాంబ గుడి తలుపులు తెరుస్తారు. ఈ సమయంలో భక్తులందరూ జగదాంబ దర్శనం చేసుకుంటారు. హస్నాంబ దేవిని ఒక వారం రోజుల పాటు పూజిస్తారు. చివరి రోజున ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ తర్వాత ఈ ఆలయ తలుపులు మళ్ళీ వచ్చే ఏడాది దీపావళి రోజున మాత్రమే తెరవబడతాయి.
ఆలయానికి సంబంధించిన కథ ప్రాచుర్యంలో ఉంది
హాసనాంబ ఆలయానికి సంబంధించిన అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని అదృశ్యమయ్యే వరం పొందాడు. బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన తరువాత అంధకాసురుడు మానవులను, ఋషులను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితిలో, ఆ రాక్షసుడిని సంహరించే బాధ్యతను శివుడు తీసుకున్నాడు. ఆ రాక్షసుడి రక్తంలోని ప్రతి చుక్క రాక్షసుడిగా మారుతుంది. అప్పుడు అతన్ని సంహరించడానికి శివుడు తపస్సు ద్వారా యోగేశ్వరి దేవిని సృష్టించాడు, ఆమె అంధకాసురుడిని సంహరించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)