AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు బంగారం, వెండి మాత్రమే కొనాల్సిన పనిలేదు.. ఈ మొక్కలు కొన్నా లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం మీ సొంతం..

ధన త్రయోదశి రోజున గృహోపకరణాలు లేదా బంగారం, వెండిని కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. ఈ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను ఇంటికి తీసుకురావడం విజయానికి మార్గం తెరుస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఈ రోజు బంగారం, వెండి మాత్రమే కొనాల్సిన పనిలేదు.. ఈ మొక్కలు కొన్నా లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం మీ సొంతం..
Vastu Tips
Surya Kala
|

Updated on: Oct 29, 2024 | 7:02 AM

Share

ధన త్రయోదశి పండుగను ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున కుబేరుడు, ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు ప్రత్యేకమైన మొక్కలలో కొన్నింటిని ఇంటికి తీసుకురావడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. ధన త్రయోదశి రోజున ఏయే మొక్కలను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకుందాం..

ధన త్రయోదశి రోజున ఈ మొక్కలను కొనండి హిందూ మతంలో సకల దేవుళ్ళకు ఏదో ఒక మొక్క అంటే ఇష్టం. ఇంట్లో వారికి ఇష్టమైన మొక్కలను నాటడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు నిలిచి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ధన త్రయోదశి రోజున ఈ మొక్కలను నాటడం వల్ల లక్ష్మీ దేవి, కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది.

కుబేరునికి ఇష్టమైన మొక్క

ఇవి కూడా చదవండి

ధన త్రయోదశి రోజున సంపదల దేవత అయిన కుబేరుడికి ఇష్టమైన క్రాసులా మొక్క తప్పనిసరిగా నాటాలి. ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచో రాకుండా ఇబ్బంది పెడుతున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. అంతేకాదు ఇంట్లో పేదరికం ఉంటే అది కూడా పోతుంది. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన త్రయోదశి రోజున క్రాసులా మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఉన్న అన్ని రకాల రోగాలు దూరమవుతాయి. ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పదేపదే క్షీణించినా, ఈ మొక్కను నాటడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

లక్ష్మీ కమలం మొక్క ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్క అంటే లక్ష్మీ కమలాన్ని తప్పనిసరిగా నాటాలి. వాస్తు శాస్త్రంలో కూడా లక్ష్మీ కమలం ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. ఇంటి ద్వారం దగ్గర ఉంచడం మంచిది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

మందార మొక్క ధన త్రయోదశి రోజున మందార మొక్కను నాటడం కూడా చాలా శ్రేయస్కరం. కుబేరునికి ఇష్టమైన మొక్క మందార. అంతేకాదు లక్ష్మీ దేవి పూజలో ఎర్ర మందార పువ్వును సమర్పించడం వల్ల ఆర్థిక లాభాలకు కొత్త మార్గాలు తెరవబడతాయి.

తులసి మొక్క హిందూ మతంలో తులసి మొక్కను దేవతగా పూజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ధన త్రయోదశి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

తెల్ల అపరాజిత మొక్క ధన త్రయోదశి రోజున తెల్లటి అపరాజిత మొక్కను కూడా నాటవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మి దేవి ఇంటికి చేరుతుందని, ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు. అంతే కాకుండా అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)