Tirumala: టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్ తో భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులేమో భయపడుద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెంపుల్ సిటీ తిరుపతిలో పరిస్థితి.

Tirumala: టెంపుల్ సిటీ తిరుపతిలో టెన్షన్.. ఆలయాలకు బెదిరింపు మెయిల్స్..
Tirumala
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Oct 29, 2024 | 7:21 AM

ఆగని బెదిరింపు మెయిల్స్ తో ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన మొదలైంది. మొన్న ఎయిర్ పోర్ట్ కు నిన్న హోటల్స్ కు ఇప్పుడు ఏకంగా ఆలయాలకు వస్తున్నాయి బెదిరింపు మెయిల్స్. VPN టెక్నాలజీతో IP అడ్రస్ లను కూడా సైబర్ ఎక్స్ పర్ట్స్ కనుగొనలేక పోతున్నారు. ఈ ఫేక్ మెయిల్స్ తో భక్తులు యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులేమో భయపడుద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెంపుల్ సిటీ తిరుపతిలో పరిస్థితి.

ఒకవైపు ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్పోర్ట్ కు బెదిరింపు. ఆ తర్వాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఇమెయిల్స్. ఇక నిన్నటి నుంచి టెంపుల్స్ కు అదే తరహా బెదిరింపు ఇ-మెయిల్స్. ఆగకుండా వరుసగా వస్తున్న థ్రెట్ మెయిల్స్ తో పోలీసు యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తిరుపతిలో గత 5 రోజులుగా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో టెంపుల్ సిటీ లో టెన్షన్ నెలకొంది. ఆగని మెయిల్స్ ఆధ్యాత్మిక నగరంలో ఆందోళన కలిగిస్తుంటే ఇప్పుడు ఏకంగా ఆలయాలకు థ్రెట్ మెయిల్స్ వస్తుండటం అలజడికి కారణం అవుతుంది. అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏఏ అకౌంట్ లో నుంచి పోస్టు చేస్తున్నారు? ఐడి లేంటి, ఐపి అడ్రస్సులెక్కడ అన్న దానిపై సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

తిరుపతిలోని నాలుగు హోటల్స్ తో పాటు కేటీ రోడ్ లోని వరదరాజస్వామి ఆలయం, హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇస్కాన్ టెంపుల్ కు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నాలుగు రోజులుగా వరుసగా వస్తున్న థ్రెట్ మెయిల్స్ తో అణువణువు తనిఖీలు నిర్వహిస్తున్న బీడీ టీమ్స్ యాత్రికులు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా మన తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అయితే ఎక్కడా ఇప్పటివరకు ఒక్క క్లూ కూడా దొరకకపోయినా పోలీస్ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంటోంది.

వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న నేరగాళ్ల ను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారిపోయింది. IP అడ్రస్ లను కనుగొనలేక పోతున్న సైబర్ ఎక్స్ పర్ట్స్స్ శ్రమ వృధా అవుతుంది. ఫేక్ మెయిల్స్ గా తేల్చుతున్న పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న తనిఖీలతో భక్తులు యాత్రికులు ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే నాలుగు హోటల్స్, రెండు ఆలయాలకు వచ్చిన బెదిరింపు మెయిల్స్ కంటిన్యూ అవుతాయని భావిస్తున్నా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందన్న ఐబి హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకుంది. ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న థ్రెట్ మెయిల్స్ పై ఆరా తీస్తుండడం ఇప్పుడు చర్చగా మారింది.

అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. హోటల్స్ కు వరుసగా థ్రెట్ మెయిల్స్ వస్తున్నాయని చెబుతున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామన్న సంకేతం ఇస్తోంది. ప్రతి థ్రెట్ మెయిల్ ను సీరియస్ గా తీసుకొని తనిఖీలు చేస్తున్నామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా మంటున్నారు. ఖచ్చితంగా కనిపెడతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి థ్రెట్ మెయిల్స్ చూస్తున్నాయని, భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు. అయితే థ్రెట్ మెయిల్స్ పై ఇతర దర్యాప్తు సంస్థల విచారణ గురించి తెలియదని చెప్పారు తిరుపతి జిల్లా అడిషనల్ ఎప్సీ రవిమనోహరచారి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..