ఆ గ్రామంలో వింత సాంప్రదాయం.. హనుమంతుడి పేరుని కూడా తలవరు.. మారుతి కార్లపై నిషేధం.. ఎందుకంటే
ఈ ఊరిలో మారుతీ కార్లు బ్యాన్, కనపడగానే ధ్వంసం చేసేవాళ్ళు... హనుమంతుడి పేరు పెట్టుకోవడం కూడా పాపంగా భావిస్తారు. అంతేకాదు ఇక్కడి ప్రజలు హనుమంతుని శత్రువు అయిన నింబ అనే రాక్షసుడిని పూజిస్తారు. హనుమంతునికి మరో పేరు మారుతి కనుక ఈ గ్రామంలో మారుతీ కార్లను కూడా నిషేధించారు. ఇక ఆ గ్రామస్తులు తమ కూతుర్లకు పెళ్ళిళ్ళను హనుమంతుడు కొలువై ఉండే గ్రామంలో చేయరు. ఆ గ్రామస్తులు హనుమంతుడు అంటే ఎందుకు ఇష్టపడరంటే?
రామ భక్త హనుమంతుడిని పూజిస్తే కష్టాలనూ తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు కలియుగంలో చిరంజీవిగా పిలిస్తే పలికే దైవంగా.. రామ నామ స్మరణ వినిపిస్తే చాలు కరుణించే దైవంగా పూజలను అందుకుంటున్న హనుమంతుడి విగ్రహాలు, ఆలయాలు దేశ వ్యాప్తంగా లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ప్రజలు హనుమంతుడిని పూజించరు. రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఈ గ్రామంలోని ప్రతి చిన్నారి నింబ రాక్షసుడి భక్తుడే. ఈ గ్రామం ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో అహ్మద్‌నగర్‌లో ఉంది. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. పురాణాల ప్రకారం దైత్య నింబా రాక్షసుడు అయినప్పటికీ శ్రీరాముడికి గొప్ప భక్తుడు.
ఈ ఊరిలో హనుమంతుడు పేరు పెట్టుకోవడం కూడా ఘోర పాపంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలు హనుమాన్, బజరంగ్ బలి, మారుతి వంటి పేర్లను ఇష్టపడరు. హనుమంతుడు సంజీవని మూలిక కోసం తీసుకెళ్లిన పర్వతం తమ గ్రామంలోనిదే ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు. హనుమంతునిపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉండడానికి కారణం ఇదే.
ఈ గ్రామ వాసులు ఎర్ర జెండాను ఎగురవేయరు. హనుమంతుడు సంజీవని మూలికను సేకరించడానికి వచ్చిన సమయంలో పర్వత దేవుడు సాధన చేస్తున్నానని హనుమంతుడికి చెప్పాడు. అయితే సంజీవని మూలిక కోసం హనుమంతుడు ఆ పర్వత రాజుని అనుమతి అడగలేదు లేదా అతని సాధన పూర్తయ్యే వరకు వేచి ఉండలేదు. అంతేకాదు హనుమంతుడు పర్వత రాజు ఆరాధనను కూడా విచ్ఛిన్నం చేశాడు. ద్రోణగిరి పర్వతాన్ని తీసుకుని వెళ్ళే సమయంలో హనుమంతుడు పర్వత రాజు కుడి భుజాన్ని కూడా పెకిలించాడని స్థానికుల కథనం.
పర్వతం నుండి ఎరుపు రంగు ప్రవహిస్తుంది
ఈ రోజు కూడా పర్వతం నుండి ఎర్రటి రక్తం ప్రవహిస్తుందని నమ్ముతారు. ద్రోణగిరి గ్రామంలోని ప్రజలు హనుమంతుడిని పూజించరు. ఎర్ర జెండాను ఎగురవేయరు. హనుమంతుడు కొలువై ఉన్న గ్రామంలో తమ కూతుళ్లకు పెళ్లి కూడా చేయరు. గ్రామంలో ఏదైనా శుభకార్యానికి ముందు నింబ దైత్య మహారాజ్‌ని పూజిస్తారు.
మారుతీ కార్లపై నిషేధం
ఈ గ్రామంలోని ఏ కారునైనా తీసుకుని వెళ్లవచ్చు. అయితే అది మారుతీ కంపెనీ కారు కాకూడదనేది షరతు. ఎవరైనా మారుతీ కారుతో ఈ గ్రామంలోకి ప్రవేశిస్తే అతని కారు ధ్వంసమైనట్లే.. ఎందుకంటే హనుమంతుని మరొక పేరు మారుతి. ద్రోణగిరి గ్రామ ప్రజలు ఈ పేరు వినడానికి కూడా ఇష్టపడకపోవడానికి కారణం ఇదే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)