SpaceX Crew-9: సునీతా, విల్మోర్ లేకుండానే వచ్చేసిన స్పేస్‌క్స్ డ్రాగన్ క్యాప్సూల్… నాసా ప్లాన్ ఏమిటి?

అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి NASA ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. ఆ వ్యోమగాములకు సహాయం చేయడానికి SpaceX క్రూ-8 మిషన్ సిద్ధం చేసింది. అయితే ఇప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ వ్యోమగాములు తిరిగి రాలేకపోయారు. దీంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సునితా విలియమ్స్ , విల్మోర్ క్రూ-8 క్యాప్సూల్‌కి ఎందుకు తిరిగి రాలేదు? ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో ఏమి చేస్తున్నారో అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది.

SpaceX Crew-9: సునీతా, విల్మోర్ లేకుండానే వచ్చేసిన స్పేస్‌క్స్ డ్రాగన్ క్యాప్సూల్... నాసా ప్లాన్ ఏమిటి?
Butch Wilmore Suni Williams
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2024 | 10:03 AM

నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ శుక్రవారం ఫ్లోరిడాలోని పెన్సకోలా తీరంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు సురక్షితంగా తిరిగి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 235 రోజులపాటు గడిపిన తర్వాత ఈ క్యాప్సూల్ తిరిగి వచ్చింది. ఎలోన్ మస్క్ కంపెనీ ఇప్పటివరకు చేపట్టిన అతి పొడవైన మనుషుల మిషన్ ఇదే. అయితే నాసాకి చెందిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఈ క్యాప్సూల్‌లో తిరిగి రాలేదు. ఈ ఇద్దరు వ్యోమగాములు జూన్‌లో ISSకి వెళ్లారు. వారంలోపు తిరిగి వస్తారని భావించారు. అయితే ఇప్పటి వరకు వీరు తిరిగి వస్తారనే ఆశ మాత్రమే కొనసాగుతోంది.

బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో హీలియం లీకేజీ, థ్రస్టర్ వైఫల్యం కారణంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు వెళ్ళిన మిషన్ సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ స్టార్‌లైనర్ జూన్ 4న బయలుదేరింది.. సునితా విలియమ్స్ , విల్మోర్ నాలుగు నెలలకు పైగా ISSలో చిక్కుకున్నారు. ఆగస్ట్‌లో NASA త్వరలో వ్యోమగాములను తిరిగి తీసుకువస్తామని ప్రకటించింది. నాసా తన వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యతనిస్తామని… అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను ఎలాగైనా వెనక్కి తీసుకువస్తామని చెప్పింది.

ఇవి కూడా చదవండి

సునీతా విలియమ్స్ కోసం పంపబడింది

వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి NASA ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. దీని కోసం ఈ వ్యోమగాములకు సహాయం చేయడానికి SpaceX కి సంబంధించిన క్రూ-8 మిషన్ సిద్ధం చేయబడింది. క్రూ-8 క్యాప్సూల్‌లో నాసాకు చెందిన నిక్ హేగ్ , రోస్కోస్మోస్‌కు చెందిన అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఆ వ్యోమగాములను తిరిగి భూమికి తిరిగి తీసుకుని రాలేకపోయారు. దీంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సునితా విలియమ్స్ , విల్మోర్ క్రూ-8 క్యాప్సూల్‌కి ఎందుకు తిరిగి రాలేదు? ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో ఏమి చేస్తున్నారో తెలుసుకుందాం..

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఏం చేస్తోంది?

ముందుగా సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. నిజానికి ఆ క్యాప్సూల్‌లో అప్పటికే నలుగురు వ్యోమగాములకు సీట్లు కేటాయించబడ్డాయి. నాసాకు చెందిన మాథ్యూ డొమినిక్, మైఖేల్ బారెట్, జీనెట్ ఎప్స్ , రోస్కోస్మోస్ అలెగ్జాండర్ గ్రెబెంకిన్ వారిలో ఉన్నారు. అయితే వీటన్నింటి మధ్య ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఎవరైనా ఇద్దరు వ్యోమగాములను ఆపి అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు హ్యోమగాములను వెనక్కి తీసుకురాలేకపోయారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. మిగిలిన వ్యోమగాముల రాకపై నాసా ట్వీట్‌ చేసి సమాచారాన్ని పంచుకుంది.

నాసా ప్లాన్ ఏంటో తెలుసుకోండి ఇప్పటివరకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSలో 18 వారాలకు పైగా గడిపారు. క్రూ-8లో భాగంగా వీరికి కొన్ని అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఎక్స్‌పెడిషన్ 72లో భాగంగా ISSలో పని చేయడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో సునీతా విలియమ్స్ తిరిగి వచ్చే వరకు ఆమె అంతరిక్షంలో చాలా పెద్ద పనులను నిర్వహిస్తుందని.. ఇప్పటికే ఆమె అక్కడ ఎన్నో పెద్ద బాధ్యతలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.

సునీతా విలియమ్స్ ISS కమాండర్ సెప్టెంబర్ 22న జరిగిన కార్యక్రమంలో సునీతా విలియమ్స్ ఐఎస్ఎస్ కమాండర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఉన్న ఇతర సిబ్బందితో పాటు సునీతకు రోజువారీ బాధ్యతలు అప్పగించబడ్డాయి. సాధారణ పనితో పాటు ఆమె అంతరిక్ష నడకలు, ఇతర శాస్త్రీయ ప్రయోగాలలో పాల్గొంటుంది.

NASAకి చెందిన ISS ప్రోగ్రామ్ మేనేజర్ డానా వీగెల్ ఆగస్ట్‌లో జరిగిన బ్రీఫింగ్‌లో ISSలో విలియమ్స్, విల్మోర్‌లకు అవసరమైన అన్ని వనరులు, మెటీరియల్‌లు శిక్షణ కోసం తాము ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ వ్యోమగాములు ఇద్దరూ EVA (స్పేస్‌వాక్) రోబోటిక్స్ వంటి అవసరమైన అన్ని నైపుణ్యాలలో పూర్తిగా శిక్షణ పొందారని కూడా వీగెల్ ధృవీకరించారు.

విల్మోర్ కూడా ఈ పని చేస్తున్నాడు అక్టోబరు 18న సునితా విలియమ్స్ క్వెస్ట్ ఎయిర్‌లాక్‌లోని ఇతర పరికరాలను క్లీన్ చేసి, డెస్టినీ లాబొరేటరీ మాడ్యూల్ 2లో అల్ట్రా-హై రిజల్యూషన్‌లో చిత్రీకరించడానికి స్పియర్ కామ్‌ను ఉపయోగించినట్లు NASA నివేదించింది. విలియమ్స్, విల్మోర్ లకు ఈ సవాలు ప్రయాణం.. వారి సహన పరీక్ష అని తెలుస్తోంది. వ్యోమగాముల భద్రత కోసం NASA, SpaceX వంటి ఏజెన్సీలు అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..