AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel-Iran War: ఇప్పటి వరకు ఒక లెక్క..ఇక నుండి మరో లెక్క.. సీన్‌లోకి అమెరికా

ఇరాన్ స్లీపర్ సెల్స్ అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, టర్కీ, బెల్జియం, డెన్మార్క్, సౌదీ అరేబియా, జర్మనీ, స్వీడన్‌లలో ఉన్నట్లు బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం తెలుస్తుంది. టెహ్రాన్‌లోని అండర్‌గ్రౌండ్ బంకర్ నుండి స్లీపర్ సెల్‌కి ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు భారీ ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Israel-Iran War: ఇప్పటి వరకు ఒక లెక్క..ఇక నుండి మరో లెక్క.. సీన్‌లోకి అమెరికా
Iran Sleeper Cells
Velpula Bharath Rao
|

Updated on: Oct 28, 2024 | 8:07 AM

Share

ఇరాన్-ఇజ్రాయెల్ రెండు ఒక్కదానిపై ఒక్కటి ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి.  అయితే ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ పైనే కాకుండా అమెరికాపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అతడి సైన్యం ప్లాన్‌లను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు లీక్ చేశాయి.

ఇరాన్ ఇజ్రాయెల్‌పైన క్షిపణులతో దాడి చేయడమే కాకుండా, ఇజ్రాయెల్ లోపల కూడా కొన్ని బాంబులతో అటాక్ చేయాలని ప్రణాళిక వేసినట్లు ఆ ఏజెన్సీలు బట్టబయలు చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాను దెబ్బతీయాలని ప్లాన్ చేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయబోతుందని వారు తెలిపారు.  అలాగే అమెరికా, యూరప్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలకు ముప్పు పొంచి ఉందని, అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై కూడా దాడి చేయవచ్చని  బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.

ఇరాన్ స్లీపర్ సెల్స్, సూసైడ్ బాంబర్లు అమెరికా, యూరప్‌లో దాడులు చేయబోతున్నాయి. ఇరాన్ అనేక దేశాల్లో ఉన్న తన స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసింది. ఆత్మాహుతి బాంబర్లను కూడా మోహరించారు. ఇజ్రాయెల్‌లోని ఆత్మాహుతి బాంబర్‌లకు VVIP వ్యక్తులను చంపే పనిని అప్పగించారు. అయితే ఇజ్రాయెల్ వెలుపల ఉన్న స్లీపర్ సెల్‌లకు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పేల్చే బాధ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి