పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం.. సరిహద్దుకు ఇరువైపులా సైన్యం మధ్య భీకర పోరు
పాకిస్తాన్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లు - పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌పై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 19 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రస్తుతం.. పాక్-ఆఫ్ఘన్ బోర్డర్, డ్యూరాండ్ లైన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లు – పాకిస్తాన్ సైన్యం మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌పై ఆఫ్ఘన్ తాలిబాన్లు సైనిక ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 19 పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రస్తుతం.. పాక్-ఆఫ్ఘన్ బోర్డర్, డ్యూరాండ్ లైన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్‌ను ప్రారంభించడంతో ఇప్పుడు రెండు వైపులా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి.
పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘన్ తాలిబాన్లు విరుచుకుపడుతున్నారు. ఇటీవల పాక్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ ఎటాక్‌కు దిగింది. పాక్-ఆఫ్ఘన్ మధ్య ఉన్న 2వేల 611 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి ఇరువైపులా భీకర పోరు జరుగుతోంది. పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే సామర్థ్యం తమకు ఉందని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఇటీవల పాక్ చేసిన వైమానిక దాడులతో ఆప్ఘనిస్తాన్‌లో 13మంది మరణించగా.. మదర్సాలు, ఇళ్లు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్‌లో ఉగ్రదాడులకు ఆఫ్ఘనిస్తానే కారణమని ఆ దేశం ఆరోపిస్తుంటే.. వాటితో తమకు సంబంధం లేదని తాలిబాన్లు స్పష్టం చేస్తోంది.
వాస్తవానికి, పాకిస్తాన్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా గురువారం ఆఫ్ఘన్ సైన్యం పాకిస్తాన్‌పై దాడి చేసింది. ఆఫ్ఘన్ సైన్యం 19 పాకిస్తాన్ సైనిక పోస్టులు, ఒక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ గురువారం రాత్రి ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. “పాకిస్తాన్ సైన్యం పదే పదే తిరుగుబాట్లు చేస్తోందని, దానికి ప్రతిస్పందనగా, డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైనిక స్థావరాలపై పెద్ద ఎత్తున దాడలు జరిగాయి” అని అన్నారు.
Pakistani and Afghan border forces clashed after the Taliban launched what it called retaliatory strikes on Pakistani installations, escalating tensions after days of cross-border hostilities https://t.co/p5ma8WnaHV pic.twitter.com/e4JOEd1K9B
— Reuters (@Reuters) February 26, 2026
ఇదిలావుంటే, కాబూల్, కాందహార్, పాక్టియాలపై పాకిస్తాన్ విమానాలు మరోసారి వైమానిక దాడులు నిర్వహించాయని మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్విట్టర్‌లో రాశారు. ఆఫ్ఘన్ పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి ఐక్యతతో తమ దేశాన్ని రక్షించుకుంటారని, బలప్రయోగానికి ధైర్యంగా స్పందిస్తారని ఆయన చెప్పారు. హింస, బాంబు దాడుల వల్ల ఏర్పడిన సమస్యల నుండి పాకిస్తాన్ తనను తాను రక్షించుకోలేదని, కానీ తన విధానాన్ని మార్చుకుని మంచి పొరుగు సంబంధాలు, పరస్పర గౌరవం, ఆఫ్ఘనిస్తాన్‌తో సానుకూల మార్గాన్ని అవలంబించాలని కర్జాయ్ కోరారు.
ఇదిలావుంటే, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ దాడులపై స్పందించారు. “పాకిస్తాన్ శాంతి, ప్రాదేశిక సమగ్రతపై రాజీపడదు. మన సాయుధ దళాల ప్రతిస్పందన సమగ్రమైనది. నిర్ణయాత్మకమైనది. మన శాంతిని బలహీనతగా తప్పుగా భావించే వారికి బలమైన ప్రతిస్పందన ఎదురవుతుంది. ఎవరూ తప్పించుకోరు” అని అన్నారు.
🇵🇰 “Pakistan will not compromise on peace & territorial integrity. Our armed forces' response is comprehensive & decisive. Those who mistake our peace for weakness will face a strong response — and no one will be beyond reach." ~ President Asif Ali Zardari
— The President of Pakistan (@PresOfPakistan) February 26, 2026
మరోవైపు, ఆదివారం జరిగిన వైమానిక దాడులను ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై దాడులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అభివర్ణించింది. గురువారం, సరిహద్దు ఘర్షణలను ధృవీకరించింది. కానీ సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నారనే వాదనలను తిరస్కరించింది. ఆఫ్ఘన్ దాడిని ఎటువంటి కవ్వింపు లేకుండా చేసిందని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
