Tollywood : అల్లు అర్జున్ చేతుల మీదుగా పురస్కారం.. ఇప్పుడు బుల్లితెరపై సూపర్ స్టార్.. ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసే పలువురు నటీనటుల త్రోబ్యాక్ పిక్చర్స్ సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ సీరియల్ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.. ?

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు చూడటం నెటిజన్లకు ఒక అలవాటు. తమకు నచ్చిన హీరో లేదా హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. తాజాగా ఒక బుజ్జి కుర్రాడి ఫోటో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. అతడికి బుల్లితెరపై విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? సీరియల్స్ అయినా.. రియాల్టీ షోస్ అయినా ఆ కుర్రాడి మార్క్ ఉండాల్సిందే. ఆ ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు, ప్రస్తుతం బుల్లితెరపై ‘చాక్లెట్ బాయ్’గా పేరు తెచ్చుకున్న మానస్ నాగులపల్లి.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
‘బ్రహ్మముడి’ సీరియల్ గురించి తెలియని వారుండరు. టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ సీరియల్‌లో హీరోగా ‘రాజ్’ (రాజ్ భూషణ్) పాత్రలో నటిస్తున్న మానస్, తన నటనతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గంభీరమైన పాత్రలో కనిపిస్తూనే, మరోవైపు సున్నితమైన భావాలను పలికిస్తూ సీరియల్‌ను రక్తికట్టిస్తున్నాడు. మానస్ ప్రయాణం కేవలం సీరియల్స్‌తోనే మొదలవ్వలేదు. ఆయన ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నతనంలోనే కెమెరా ముందుకు వచ్చిన మానస్, అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మానస్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని తన నిజాయితీతో కూడిన ప్రవర్తనతో ‘మిస్టర్ కూల్’ అని పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు క్రేజ్ మరింత పెరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో మానస్ చాలా క్యూట్‌గా, అమాయకంగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూసిన అభిమానులు “మా రాజ్ గారు అప్పట్లోనే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు”, “చిన్నప్పటి నుండి మానస్‌లో ఆ కళ ఉంది” అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. సినిమా రంగంలో కంటే బుల్లితెరపైనే మానస్ అత్యధిక ప్రజాదరణ పొందాడు. ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో కావ్యతో ఆయన కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..
