ఒడిశాలో చేపలు పడుతున్న అవినాష్ బిజులి నోట్లోకి ఓ చిన్న చేప జారి గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సకాలంలో సరైన వైద్యం అందక మరణించాడని కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటన ఒడిశా వ్యాప్తంగా విషాదం నింపింది.