AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biker Movie: శర్వానంద్ ‘బైకర్’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? మంచి సినిమా మిస్ చేసుకున్నాడు..

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ నటించిన లేటస్ట్ సినిమా బైకర్. హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీలో మరో హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 03న విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Biker Movie: శర్వానంద్ 'బైకర్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? మంచి సినిమా మిస్ చేసుకున్నాడు..
Biker Movie
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 3:29 PM

Share

ఈ ఏడాది సంక్రాంతికి నారి నారి నడుమ మురారి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ బైకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ ప్రామిసింగ్ హీరో. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో కనిపించారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా యూవీ క్రియేషన్స్ బైకర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అందుకు తగ్గట్టుగానే టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ బజ్ అందుకున్న బైకర్ సినిమా ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా హిట్ టాక్ తో మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. శర్వానంద్, రాజశేఖర్ ల నటన, తండ్రీ కొడుకుల ఎమోషనల్ సెంటిమెంట్, రేసింగ్ సన్నివేశాలు బైకర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి బైకర్ సినిమాతో వరుసగా రెండో హిట్ ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

బైకర్ సినిమాకు హీరోగా శర్వానంద్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమా కథ కోసం ముందుగా మేకర్స్ మెగా హీరో వరుణ్ తేజ్ ను సంప్రదించారట. కథ విన్న మెగా ప్రిన్స్ కూడా ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి వరుణ్ తప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ వరుణ్ తేజ్ బైకర్ సినిమా చేసి ఉంటే బాగుండేదని, గతంలో ఇలాంటి సినిమాలు అతను చాలా చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వరుణ్ మంచి సినిమాను మిస్ చేసుకున్నాడని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా బైకర్ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. జిబ్రాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us