AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్

ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్

Phani CH
|

Updated on: Jun 21, 2026 | 4:55 PM

Share

పరస్పర అంగీకారంతో లివ్‌-ఇన్‌ రిలేషన్‌లో ఉన్నామని చెబుతూ రక్షణ కోరిన ఓ జంట పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. యువకుడికి చట్టబద్ధ వివాహ వయసు రాలేదని గుర్తించిన ధర్మాసనం పోలీసు రక్షణకు నిరాకరించింది.

పంజాబ్‌కు చెందిన ఓ జంట తాము పరస్పర అంగీకారంతో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, కుటుంబం నుంచి ఒత్తిడి, బెదిరింపులు ఎదురవుతున్నాయని చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. తమకు భద్రత కల్పించాలని కోరింది. అయితే కేసును విచారించిన జస్టిస్ సందీప్ మౌద్గిల్ నేతృత్వంలోని ధర్మాసనం రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అంటూ హైకోర్టు చెప్పిన ఆ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ప్రేమలో పడిన ఓ యువతీ–యువకుడు.. పెద్దల ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి కొత్త జీవితం మొదలుపెట్టారు. అయితే పెద్దలు తమను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే పని జరగలేదు. దీంతో రక్షణ కోరుతూ హైకోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ కూడా వారికి ఊహించని తీర్పు ఎదురైంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనేది కొంతమంది ఎంచుకుంటున్న ఆధునిక జీవనశైలి అయినప్పటికీ.. ప్రతి సందర్భంలో దానిని చట్టబద్ధ సంబంధంగా గుర్తించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం కొంతకాలం కలిసి ఉండటంతోనే ఇది చట్టబద్ధ సంబంధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇంకా హైకోర్టు మరికొన్ని వ్యాఖ్యలు చేస్తూ.. తల్లిదండ్రుల నుంచి ఇల్లు వదిలి వెళ్లిపోవడం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని తెలిపింది. ఇది తల్లిదండ్రులు గౌరవంతో జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని కామెంట్‌ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ జంట మాత్రం తామిద్దరం లివింగ్‌ రిలేషన్‌లో ఉండేందుకు అర్హులమని వాదించింది. అయితే.. యువకుడికి ఇంకా చట్టబద్ధంగా వివాహ వయసు రాలేదని హైకోర్టు గుర్తించింది. మొత్తంగా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఒక్కటిగా జీవితం మొదలుపెట్టిన ఈ ప్రేమ జంటకు హైహైకోర్టులో షాకింగ్‌ తీర్పు ఎదురైంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందన్న వాదన ఉన్నా.. ప్రతీ కేసులో కోర్టు జోక్యం చేసుకుంటే సామాజిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించింది. ఈ జంటకు పోలీసు రక్షణ ఇవ్వడానికి నిరాకరించి పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

44 నుంచి 60 ఏళ్ల వయసులో మీ శరీరంలో జరిగేది ఇదే! అధ్యయనాల్లో కొత్త నిజాలు

బాత్రూమ్‌లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

గ్యాస్‌ వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌! జూన్ 30 లాస్ట్‌ డేట్‌ ఏం చేయాలంటే?

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! కాఫ్‌ సిరప్ కు బానిసగా యూత్‌.. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

Follow Us