AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandini Reddy: పెళ్లిపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పిన నందిని రెడ్డి..

దర్శకురాలు నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన ఆరేళ్ల పోరాటాన్ని, అలా మొదలైంది సినిమా విడుదలకు ముందు ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను పంచుకున్నారు. ఆమె వ్యక్తిగత శైలి, సౌకర్యానికి ప్రాధాన్యత, వివాహం గురించి తన నిక్కచ్చి అభిప్రాయాలను వెల్లడించారు. ఒంటరితనం లేదని వివరించారు.

Nandini Reddy: పెళ్లిపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పిన నందిని రెడ్డి..
Nandini Reddy
Ram Naramaneni
|

Updated on: Jun 21, 2026 | 4:23 PM

Share

తెలుగు సినీ దర్శకురాలు నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొదటి సినిమా అలా మొదలైంది స్క్రిప్ట్ చెప్పే సమయం నుంచి విడుదలకు దాదాపు ఆరేళ్ల సమయం పట్టిందని, ఈ కాలం తన జీవితంలో అత్యంత కష్టమైన దశ అని ఆమె పేర్కొన్నారు. తన స్నేహితులు డాక్టర్లుగా స్థిరపడి, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో తాను మాత్రం సినిమా కోసం పోరాడాల్సి వచ్చిందని, అప్పుడప్పుడు తాను తప్పు చేశానా అని కూడా అనిపించేదని నందిని రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు, స్నేహితులు బిల్లులు కట్టేవారని, తాను పాకెట్ మనీ కోసం వరల్డ్ స్పేస్ కంపెనీలో రేడియో జాకీగా పనిచేసినట్లు తెలిపారు. అప్పుడు నెలకు 20,000 రూపాయలు వచ్చేదని, వాటితో తన టూ-వీలర్ పెట్రోల్ ఖర్చులు పోగా, కొంత మిగిలేదని వివరించారు. అలా మొదలైంది సినిమా కోసం మొదట 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని, తరువాత తమిళ రైట్స్ అమ్ముడయ్యాక 20 లక్షలు అదనంగా లభించాయని ఆమె చెప్పారు. ఈ డబ్బుతో తన తల్లి పదేళ్ల పాత అప్పును తీర్చినట్లు నందిని రెడ్డి తెలిపారు. అప్పట్లో రౌడీ షీటర్లు ఇంటికి వచ్చి బెదిరించేవారని, సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బు ఇస్తానని నమ్మకంగా చెప్పి వారిని పంపించేసి, సినిమా హిట్ అయ్యాక నిర్మాత దాము గారి నుంచి డబ్బు తీసుకొని అప్పు తీర్చినట్లు వివరించారు.

శైలి, సౌకర్యానికి ప్రాధాన్యత

తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, నందిని రెడ్డి ఎప్పుడూ సౌకర్యానికే పెద్ద పీట వేస్తానని స్పష్టం చేశారు. జుట్టు చిక్కు తీసేటప్పుడు నొప్పి రాకుండా బాయ్ కట్ చేసుకోవడం, క్రీడలు ఆడేటప్పుడు, బైక్ నడిపేటప్పుడు ప్యాంట్లు సౌకర్యవంతంగా ఉండటం వంటివి తన వ్యక్తిగత శైలిపై ప్రభావం చూపాయని చెప్పారు. స్టైల్ కంటే కంఫర్టే ముఖ్యమని, మేకప్, లిప్‌స్టిక్‌లపై తనకు ఆసక్తి లేదని నందిని రెడ్డి తెలిపారు. చీరల్లో తన స్ట్రైడ్ (నడిచే విధానం) సాధ్యం కాదని, అవి అసౌకర్యంగా అనిపించడంతో వాటిని మానేశానని పేర్కొన్నారు.

వివాహం, సంబంధాలపై అభిప్రాయాలు

పెళ్లి గురించి అడగ్గా, నందిని రెడ్డి తనకు పెళ్లి చేసుకోవాలని కచ్చితంగా లేదని, చేసుకోకూడదని కూడా లేదని అన్నారు. నెవర్ నో, ఎవరైనా దొరికితే చేసుకుంటానేమో అని నవ్వుతూ చెప్పారు. కాలేజీ రోజుల్లో (జేఎన్‌యూలో) డేటింగ్ జరిగిందని, కానీ అవి పెళ్లి వరకు వెళ్లలేదని తెలిపారు. సినీ పరిశ్రమకు వచ్చాక, దర్శకురాలిగా తన కెరీర్ చాలా డిమాండింగ్‌గా ఉండటం వల్ల, తమ వృత్తిని అర్థం చేసుకునే వ్యక్తి ఇంకా తారసపడలేదని చెప్పారు. తనకు సినిమా పరిశ్రమ బయట నుంచి పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని, కానీ అవి సరైనవిగా అనిపించలేదని తెలిపారు. తాను తన వృత్తి పట్ల చాలా సీరియస్‌గా ఉంటానని, తనకు పెళ్లి విషయంలో ఎటువంటి వెలితి లేదని నందిని రెడ్డి అన్నారు. తన తల్లితో కలిసి నివసిస్తుండటం వల్ల ఒంటరితనం అనే భావన లేదని స్పష్టం చేశారు. చిన్నతనం నుండి తనకు తన సొంత కంపెనీ అంటే చాలా ఇష్టమని, పుస్తకాలు ఇస్తే గంటల తరబడి గదిలోనే గడిపేస్తానని తెలిపారు. తన బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ తన స్కూల్, కాలేజీ స్నేహితులేనని, వారే తనను గ్రౌండెడ్‌గా ఉంచుతారని, తనను దర్శకురాలిగా కాకుండా స్నేహితురాలిగానే చూస్తారని నందిని రెడ్డి పేర్కొన్నారు.

Follow Us