హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల భామ ఫరియా అబ్దుల్లా 

21 June 2026

Pic credit - Instagram

Rajeev 

ఫరియా అబ్దుల్లా..2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. నక్షత్ర అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

ఫరియా అబ్దుల్లా 1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా.

ఆమె తన పదవ తరగతి వరకు మెరిడియాన్ అండ్ భవన్స్ లో పూర్తి చేసింది. హైదరాబాదు లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. 

జాతిరత్నాలు తర్వాత అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది.

అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో తన డాన్స్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ..

తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ హిట్స్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది.