International Yoga Day 2026: విజయవాడలో యోగాంధ్ర.. లైవ్ వీడియో..
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర-2026’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో బాబా రాందేవ్, సీఎం చంద్రబాబు పాల్గొని యోగాసనాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు.
శారీరక, మానసిక ఉల్లాసానికి భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన కానుక యోగా. ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా యోగా డే వేడుకలు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. అన్ని రాష్ట్రాల్లోనూ యోగా డే వేడుకులు జరుగుతున్నాయి.. ఏపీలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర -2026 వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్య అతిథిగా హాజరైన బాబా రాందేవ్, సీఎం చంద్రబాబు తెల్లవారుజాము నుంచే యోగాసనాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
లైవ్ వీడియో చూడండి..
సామూహిక యోగాలో 6,300 మంది యోగా శిక్షకులు పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 33 వేల కేంద్రాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఏర్పాట్లు చేశారు. ‘ఇంటింటికీ యోగా’ అనే ప్రధాన థీమ్‌తో ఏడాది పొడవునా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందుకోసం 2 లక్షల 6వేల మంది ట్రైనర్లను సిద్ధం చేశారు. రికార్డు స్థాయిలో కోటి మందికి పైగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యోగాను ప్రజల జీవనశైలిలో భాగం చేయడమే లక్ష్యం అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమం అమలు చేస్తోంది.
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
