ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
ముంబైలో తీవ్ర ఉక్కపోత, తరచూ జరుగుతున్న విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఇళ్లలో నిద్రపోలేక బీచ్‌లను ఆశ్రయిస్తున్నారు. వెర్సోవా బీచ్ వద్ద స్థానికులు రాత్రిళ్లు అలల గాలిలో నిద్రిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, నీటి కొరత, పెరుగుతున్న వేడి పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చాయి.
ముంబై మహా నగరంలో పవర్ కట్స్ స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి. కరెంట్ కోతలను భరించలేక జనం ఇళ్లకు తాళాలేసి దగ్గర్లో బీచ్ ఉండటంతో.. వెళ్లి బీచ్ ఒడ్డున రాత్రుళ్లు నిద్రపోతున్నారు. కొంచెం వింతగా అనిపించినా ఇది నిజం. ఇళ్లలోనే ఉండి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవడం కంటే బీచ్ ఒడ్డున అలల హోరుకు వచ్చే గాలికి హాయిగా నిద్రపోవడం బెటర్ అని ముంబై జనం.. వెర్సోవా బీచ్‌లో నిద్రపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీచ్లో నిద్రిస్తున్న వాళ్లంతా.. వెర్సోవా బీచ్ దగ్గరలో ఉన్న ఇందిరా నగర్ మురికివాడ వాసులని.. రేకుల ఇళ్లలో వేడి భరించలేనంతగా పెరగడంతో ఇలా బీచ్ ఒడ్డుకు చేరుకుని నిద్రపోతున్నారని తెలిసింది. ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ముంబైలో నీటి నిల్వలు 10 నుంచి12 శాతానికి పడిపోయాయి. దాంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మే 15 నుంచి ముంబై అంతటా 10 శాతం నీటి కోతను అమలు చేసింది. ముంబై మహా నగరంలో విద్యుత్ కోతల కారణంగా గత నెల రోజులుగా జనం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల వరకూ ఇళ్లలో బదులు వీధుల్లోనే గడుపుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ముంబైలో సామాన్య, మధ్య తరగతి జనం ఇళ్లలో ఉండలేక.. అస్తమానం రోడ్ల మీద ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. భారత్లో సూపర్ ఎల్నినో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. జూన్ నెల వచ్చి 15 రోజులు దాటినా ఎండలు మాత్రం మే నెలలో మాదిరిగా నిప్పులు కురిపిస్తు్న్నాయి. ఈ ఎండలకు తోడు కరెంట్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగలంతా పని చేసొచ్చి రాత్రి ప్రశాంతంగా పడుకుందామంటే కరెంట్ ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను వీపుపై మోసుకుని కలెక్టరేట్‌కు.. 10 ఏళ్లుగా న్యాయం కోసం కుటుంబం పోరాటం
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని.. చిన్న స్పార్క్ వచ్చినా ప్రమాదమే!
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

