China: చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం.. తగ్గిపోతున్న జననాలు.. మూత పడుతున్న ప్రైమరీ స్కూల్స్‌

వన్‌ ఆర్‌ నన్‌.. ఒక్కరు లేక అసలే వద్దు.. ఇదీ.. ఒకప్పటి చైనా జనాభా నిరోధక మంత్రం.. పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు చైనా అనుసరించిన విధానం.. ఇదే.. ఇప్పుడు.. డ్రాగన్‌ కంట్రీకి శాపంగా మారింది. అవును.. జనాభా పరంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. తాజా పరిస్థితులే.. చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. స్కూల్స్‌లో చేరే చిన్నారులు తగ్గిపోతుండగా.. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో మూతపడిన పాఠశాలలను చైనా వృద్ధాశ్రమాలుగా మార్చుతుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

China: చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం.. తగ్గిపోతున్న జననాలు.. మూత పడుతున్న ప్రైమరీ స్కూల్స్‌
China Papulation CrisesImage Credit source: Reuters photo
Follow us
Surya Kala

|

Updated on: Oct 28, 2024 | 7:29 AM

డ్రాగన్‌ కంట్రీ చైనా వరుసగా అనేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటోంది. ప్రధానంగా.. రెండు సంక్షోభాలు చైనాను వెంటాడుతున్నాయి. ఒకవైపు బర్త్‌ రేటు, సంతనోత్పత్తి రేటు పడిపోగా.. మరోవైపు.. వృద్ధ జనాభా పెరుగుతూ చైనా భయపెడుతోంది. తాజాగా.. చైనా విద్యాశాఖ రిలీజ్‌ చేసిన ఓ రిపోర్ట్‌ ఆ దేశ సంక్షోభ పరిస్థితులను బహిర్గతం చేస్తోంది. ఇంతకీ.. చైనా విద్యాశాఖ రిపోర్ట్‌లో ఏముంది?…

గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా.. ఆ ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతోందని చైనా విద్యాశాఖ రిపోర్ట్‌లో వెల్లడికావడం కలవరపెడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్‌ మూసివేసినట్లు తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2023లో చైనాలో 14,808 కిండర్‌ గార్టెన్లు అంటే.. పాఠశాలలు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తన రిపోర్ట్‌లో తెలిపింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గతేడాది కంటే 11శాతం తగ్గడమే అందుకు కారణమని పేర్కొంది. 2023లో 5,645 స్కూల్స్‌ మూతపడినట్లు చైనా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.

వాస్తవానికి.. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయి ఇటీవల 140కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన 2023లో చైనాలో 90లక్షల జననాలు రికార్డ్‌ కాగా.. 1949 తర్వాత ఈ రేంజ్‌లో తక్కువ బర్త్‌ రేట్‌ నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే.. జనాభా పరంగా చైనా రెండు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కోంటోంది. ఒకవైపు జననాల రేటు తగ్గడం.. అదే సమయంలో సంతానోత్పత్తి మరింతగా పడిపోవడం.. మరోవైపు.. వృద్ధ జనాభా భారీగా పెరిపోతుండడం చైనాను ఇబ్బంది పెడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

2023 నాటికి 60ఏళ్లు పైబడినవాళ్ల సంఖ్య 30కోట్లకు చేరుకోగా.. 2035నాటికి ఈ సంఖ్య 40కోట్లకు, 2050నాటికి 50కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ రిపోర్ట్‌లో వెల్లడైంది. ఆయా పరిణామాలు కూడా డ్రాగన్‌ కంట్రీకి దడ పుట్టిస్తున్నాయి. అయితే.. స్కూల్స్‌లో చేరే చిన్నారులు తగ్గిపోతుండగా.. వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో మూతపడిన పాఠశాలలను చైనా వృద్ధాశ్రమాలుగా మార్చుతుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

ఆయా సంక్షోభ పరిణామాలకు చైనా అనుసరించిన దశాబ్ధాల నాటి కఠినమైన ఒక బిడ్డ విధానమే వృద్ధుల సంఖ్యను పెంచుతోందని సర్వేలు చెప్తున్నాయి. కంటే ఒక్కరినే కనాలి.. అనే నాటి చైనా విధానంతో తీవ్ర జనాభా సంక్షోభం ఎదురవుతుండడంతో 2016లో ఆ రూల్‌కు గుడ్‌ బై చెప్పి.. ఇద్దరు పిల్లలను కనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పుడు.. ఒక్కరు కాస్తా.. ఇద్దరు.. ఇద్దరు కాస్తా.. ముగ్గురికి సవరించింది. ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేలా వీలు కల్పించింది.

అంతేకాదు.. పెళ్లిళ్లను కూడా సులభతరం చేయాలని, విడాకులు తీసుకోవడాన్ని కఠినతరం చేయాలని కూడా చైనా భావిస్తోంది. మొత్తంగా.. చైనా ఇప్పటికే.. తగ్గిపోతున్న జననాల రేటుతో తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది.  ఇప్పుడు.. స్కూల్స్‌లో జాయిన్‌ అయ్యే చిన్నారులు లేక పాఠశాలలు మూతపడుతుండడం మరింత ఇబ్బందిగా మారుతోంది. అయితే.. జనాభా విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన డ్రాగన్‌ కంట్రీ.. ఇప్పుడు స్కూల్స్‌ మూసివేత విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి మరి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్