ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..

ఒకరిద్దరు కాదు ఆ  కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది. 2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. "ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్" అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం,  వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..
Turkish Ulas Family
Follow us

|

Updated on: Apr 02, 2024 | 6:17 AM

డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతుల నుంచి మనుషులు వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే. శతాబ్దాలు గడిచేకొద్దీ మానవ శరీర నిర్మాణం, జీవన శైలి, అలవాట్లు మారిపోయాయి. అయినప్పటికీ టర్కీలోని ఒక కుటుంబం ఇప్పటికీ 2 చేతులు, 2 కాళ్ళను ఉపయోగించి కోతుల వలె నడుస్తుంది. ఇలా ఒకరిద్దరు కాదు ఆ  కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది.

2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. “ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్” అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం,  వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది వైజ్ఞానిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిణామాత్మక మనస్తత్వవేత్త ప్రొఫెసర్ నికోలస్ హంఫ్రీ.. ఈ విషయంపై స్పందిస్తూ మనం 2 కాళ్లపై నడవగల, నిలబడగల సామర్థ్యం కలిగి ఉన్నామని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికీ ఈ ఉలాస్ కుటుంబం మాత్రం చేతులు, కాళ్ల సాయంతో జంతువులా నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అలాగే ఆ ​​కుటుంబంలోని 18 మంది పిల్లలలో 6 మందికి పుట్టుకతోనే అదే అలవాటు ఉంది. వీరు ఎవరూ స్ట్రైట్ గా నిలబడలేరు. నేలపైకి వంగి నడవడానికి వీరు తమ చేతులను,  కాళ్ళను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసు మానవ పరిణామానికి పెను సవాలు. ఈ సంఘటన మానవజాతి పరిణామాన్ని తారుమారు చేసింది. ఇలా 2 చేతులు, 2 కాళ్లతో నడిచేవారిలో చిన్న మెదడు చిన్నగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ సెరెబెల్లమ్ పరిమాణం ఉన్న వ్యక్తులందరూ ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉంటారని.. ఒకేలా నడుస్తారని చెప్పలేమని చెబుతున్నారు.

అలాగే లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో చతుర్భుజాలుగా నడిచే వ్యక్తులు.. సాధారణ మానవుల కంటే కోతుల మాదిరిగానే అస్థిపంజర లక్షణాలను కలిగి ఉన్నాయరని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..