AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోతైన సముద్రంలో ఈతకొట్టే ఒంటెలు.. ఎక్కడోకాదు మన దేశంలోనే.. వీటి పాలకు యమ డిమాండ్.. ఎందుకంటే..?

ఈ ప్రాంతాల్లో ఒంటె పాలను కూడా విరివిగా వాడుతుంటారు. అనేక ఆహార ఉత్పత్తులు సైతం ఈ ఒంటె పాలతో తయారు చేస్తున్నారు. వాటి వినియోగం ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ ఒంటె పాలకు స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా డిమాండ్ ఉంది. ఈ పాలు తాగడం వల్ల

లోతైన సముద్రంలో ఈతకొట్టే ఒంటెలు.. ఎక్కడోకాదు మన దేశంలోనే.. వీటి పాలకు యమ డిమాండ్.. ఎందుకంటే..?
Kharai Camels
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2024 | 8:28 AM

Share

ఒంటెను ఎడారి ఓడ అంటారు. నీరు లేకుండా చాలా రోజులు బతికే శక్తి వీటికి ఉందని మనందరికీ తెలిసిందే. సాధారణంగా ఒంటెలు ఇసుక మీద సులువుగా నడుస్తుంటాయి. అలా మనం వాటిని చాలాసార్లు చూసి ఉంటారు. కానీ ఒంటె నీటిలో ఈదడం ఎప్పుడైనా చూసారా..? అవును. ఇది విదేశాల్లో ఎక్కడా కనిపించని ఒంటె జాతి. కేవలం ఇది మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇది లోతైన నీటిలో మూడు కిలోమీటర్ల వరకు ఈదగలదు. ఈ ప్రత్యేక జాతి ఒంటెకు జాతీయ గుర్తింపు కూడా ఉంది. దీనిని ‘ఖరై’ అని పిలుస్తారు. భారతదేశంలో అవి ఎక్కడ దొరుకుతాయి. వాటి ప్రత్యేకత ఏమిటి… తెలుసుకోవాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే..

ఆహారం కోసం సముద్రం దాటుతుంది..

‘ఖరై’ జాతి ఒంటెలు గుజరాత్‌లోని కచ్‌లో ప్రసిద్ధి చెందాయి. ఈ ఒంటె ప్రత్యేకత ఏమిటంటే ఇవి తమ ఆహారాన్ని ఎడారిలో కాకుండా లోతైన నీటిలో కనుగొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి ప్రధాన ఆహారం చెర్ అని పిలువబడే ఒక మొక్క. దాని కోసం అవి సముద్రాన్ని కూడా దాటుతాయి. ఈ జాతి ఒంటె జాతీయ గుర్తింపును కూడా పొందింది.

ఇవి కూడా చదవండి

ఈ జాతి ఒంటెలు ఎక్కడ కనిపిస్తాయి..

ఈ జాతి ఒంటె కచ్ తీరప్రాంత గ్రామాలలో కనిపిస్తుంది. అవి సముద్రంలో ఉన్న వృక్షసంపదను తింటాయి. మానవ సహాయం లేకుండా లోతైన నీటిలో 3 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించగలవు. కచ్‌లో కనిపించే ఈ ఖరై జాతి ఒంటె వోంద్, సూరజ్‌బరి, అంబలియార, జంగీ వరకు సముద్ర తీర ప్రాంతంలో కనిపిస్తుంది.

వాటి సంఖ్య తగ్గుతోంది..

మీడియా నివేదికల ప్రకారం, ఈ జాతి ఒంటెల సంఖ్య 2012 సంవత్సరంలో 4,000 కాగా, ఇప్పుడు 2,000 కంటే తక్కువకు పడిపోయింది. ఒంటెలకు ఇష్టమైన ఆహారం అయిన చెర్ వృక్షసంపద తగ్గపోవడం దీని వెనుక కారణం. అయినప్పటికీ, స్థానిక ప్రజల నుండి అటవీ శాఖ, కొన్ని సంస్థలు కూడా వాటి సంరక్షణ, రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి.

ఒంటె పాలకు కూడా చాలా డిమాండ్ ఉంది..

ఈ ప్రాంతాల్లో ఒంటె పాలను కూడా విరివిగా వాడుతుంటారు. అనేక ఆహార ఉత్పత్తులు సైతం ఈ ఒంటె పాలతో తయారు చేస్తున్నారు. వాటి వినియోగం ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఈ ఒంటె పాలకు స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా డిమాండ్ ఉంది. ఈ పాలు తాగడం వల్ల మూర్ఛ, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు అని ప్రజల్లో బలమైన విశ్వాసం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..