AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG, T20 WC Final Highlights: 7 పరుగుల తేడాతో ఘన విజయం.. ఫైనల్‌ చేరిన భారత్

India vs England, T20 WC world cup 2026 Final Highlights in Telugu: 2026 టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి 4వసారి ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో ఇది రెండో సెమీఫైనల్. ఇందులో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్‌తో భారత్ ఆదివారం ఫైనల్‌లో తలపడనుంది.

IND vs ENG, T20 WC Final Highlights: 7 పరుగుల తేడాతో ఘన విజయం.. ఫైనల్‌ చేరిన భారత్
Ind Vs Eng Live Updates
Venkata Chari
|

Updated on: Mar 05, 2026 | 11:03 PM

Share

IND vs ENG, T20 WC Final Highlights: 2026 టీ20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో ఇది రెండో సెమీఫైనల్. ఇందులో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్‌తో భారత్ ఇప్పుడు ఫైనల్‌లో తలపడనుంది. రెండవ సెమీఫైనల్లో గెలవడానికి, భారత్ 254 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, ఇంగ్లాండ్ ఈ స్కోర్ ను ఛేదించడంలో విఫలమైంది.

ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తరఫున అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్ జాకబ్ బెథెల్. అతను సెమీ-ఫైనల్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. బెథెల్ 48 బంతుల్లో 7 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు. ఇది అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అతని మొదటి సెంచరీ. అయితే, బెథెల్ సెంచరీ చేసినప్పటికీ, ఇంగ్లాండ్ విజయం సాధించలేకపోయింది.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Mar 2026 10:54 PM (IST)

    4వ సారి ఫైనల్‌‌కు భారత్..

    భారత జట్టు నాల్గవసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

  • 05 Mar 2026 10:15 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్ 14 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ మరోసారి స్టన్నింగ్ క్యాచ్‌తో విల్ జాక్స్ (35)ను పెవిలియన్ చేర్చాడు.

  • 05 Mar 2026 10:03 PM (IST)

    ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకౌట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు..

    19 – ఫిన్ అల్లెన్ (న్యూజిలాండ్) vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా, 2026 (SF)

    19 – జాకబ్ బెథెల్ (ఇంగ్లాండ్) vs ఇండియా, ముంబై (వాంఖేడ్), 2026

  • 05 Mar 2026 09:52 PM (IST)

    10 ఓవర్లకు..

    ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ 4 వికెట్లకు 113 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్, విల్ జాక్స్ క్రీజులో ఉన్నారు.

  • 05 Mar 2026 09:41 PM (IST)

    4వ వికెట్ డౌన్

    అక్షర్ పటేల్ వరుసగా రెండు సిక్స్‌లు ఇచ్చి మూడో బంతికి డేంజరస్‌గా మారుతోన్న టామ్ బాటన్ (17)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 7.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

  • 05 Mar 2026 09:29 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    ఇంగ్లాండ్ జట్టు 3వ వికెట్ కోల్పోయింది. బట్లర్ 25 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

  • 05 Mar 2026 09:21 PM (IST)

    అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్

    బుమ్రా రంగంలోకి దిగగానే తొలి బంతికే వికెట్ అందించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కొట్టి భారీ షాట్‌ను అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

  • 05 Mar 2026 09:06 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    ఇంగ్లాండ్ డేంజరస్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. హార్దిక్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.

  • 05 Mar 2026 08:48 PM (IST)

    ఇంగ్లాండ్ టార్గెట్ 254

    టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.

  • 05 Mar 2026 08:25 PM (IST)

    17 ఓవర్లకు..

    17 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 205 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 13, దుబే 37 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 05 Mar 2026 08:19 PM (IST)

    IND vs ENG: సూర్య ఔట్

    15.4 ఓవర్లకు భారత జట్టు 4 వికెట్లు కోల్పోియి 190 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేసిన తర్వాత స్టంప్ ఔట్ అయ్యాడు.

  • 05 Mar 2026 08:04 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    జాక్స్ వేసిన బౌలింగులో 89 పరుగుల వద్ద సంజూ శాంసన్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు

  • 05 Mar 2026 08:03 PM (IST)

    ఆదిల్ రషీద్ ఖాతాలో చెత్త రికార్డు

    టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న మొదటి బౌలర్‌గా ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నిలిచాడు. భారత బ్యాటర్లు (ముఖ్యంగా సంజూ శాంసన్, శివమ్ దూబే) వరుసపెట్టి సిక్సర్లు బాదడంతో రషీద్ ఈ చెత్త మైలురాయిని చేరుకోవాల్సి వచ్చింది.

  • 05 Mar 2026 08:00 PM (IST)

    ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో దూబే భారీ సిక్సర్

    శివమ్ దూబే తన పవర్‌ను మరోసారి చాటుకున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వేసిన బంతి లెంగ్త్‌ను ముందుగానే పసిగట్టిన దూబే, లాంగ్ ఆన్   మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు.

  • 05 Mar 2026 07:57 PM (IST)

    రికార్డు స్కోరు

    కేవలం 8.3 ఓవర్లలోనే భారత్ తన స్కోరును 100 పరుగుల మార్కుకు చేర్చింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక నాకౌట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది.

    టాప్ 2 రికార్డులు ఇవే:

    1. న్యూజిలాండ్: నిన్నటి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాపై కేవలం 7.5 ఓవర్లలోనే 100 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది.

    2. భారత్: నేడు ఇంగ్లాండ్‌పై 8.3 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది.

  • 05 Mar 2026 07:53 PM (IST)

    సంజూ శాంసన్ సిక్సర్

    ఇంగ్లాండ్ పేసర్ జేమీ ఓవర్టన్ మళ్లీ బౌలింగ్ దాడికి రాగా, సంజూ శాంసన్ అతనికి ఘనస్వాగతం పలికాడు. ఓవర్టన్ వేసిన బంతిని సంజూ నేరుగా బౌలర్ తల మీదుగా స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. క్రీజులో సంజూ శాంసన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. బౌలర్ ఎవరైనా సరే ఏమాత్రం కనికరం లేకుండా బాదుతున్నాడు.

  • 05 Mar 2026 07:45 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    ఇషాన్ కిషన్ (39) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.  దీంతో భారత్ 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 117 పరుగులు సాధించింది.

  • 05 Mar 2026 07:39 PM (IST)

    శాంసన్ హాఫ్ సెంచరీ

    శాంసన్ మరోసారి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో టీమిండియా భారీ స్కోర్‌కు పునాది వేస్తున్నాడు. 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లతో తనదైన శైలిలో విరుచుకపడ్డాడు.

  • 05 Mar 2026 07:29 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు సాధించింది. శాంసన్ 41, కిషన్ 16 పరుగులతో నిలిచారు.

  • 05 Mar 2026 07:21 PM (IST)

    50 పరుగులు దాటిన భారత్..

    తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టు కేవలం 4 ఓవర్లలోపే 50 పరుగుల మార్క్ చేరుకుంది. శాంసన్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. మొత్తంగా 5 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయిన భారత్ 55 పరుగులు సాధించింది.

  • 05 Mar 2026 07:13 PM (IST)

    3 ఓవర్లకు..

    3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 34 పరుగులు చేసింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ (9) రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 05 Mar 2026 07:09 PM (IST)

    IND vs ENG Score: అభిషేక్ ఔట్..

    తొలి ఓవర్ నుంచే దూకుడైన ఆరంభం వచ్చినా.. అభిషేక్ శర్మ మాత్రం తన పేలవ ఫాంను కొనసాగించాడు. వరుస బౌండరీలు కొడుతూ ఫాంలో కనిపించిన అభిషేక్.. 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 20 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • 05 Mar 2026 06:37 PM (IST)

    ఇరు జట్లు:

    భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

    ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

  • 05 Mar 2026 06:35 PM (IST)

    IND vs ENG Toss Update: టాస్ గెలిచిన ఇంగ్లాండ్..

    టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 05 Mar 2026 06:05 PM (IST)

    IND vs ENG: స్టేడియం చేరుకున్న ఇరుజట్లు..

    వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు స్టేడియం చేరుకున్నాయి.

  • 05 Mar 2026 05:35 PM (IST)

    రిజర్వ్ డే న మ్యాచ్ సాధ్యం కాకపోతే..

    రిజర్వ్ డేలో సెమీఫైనల్ నిర్వహించలేకపోతే, నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే సూపర్ 8 దశలో గ్రూప్ 1లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది.

  • 05 Mar 2026 05:25 PM (IST)

    మ్యాచ్‌కు రిజర్వ్ డే

    ముంబైలో వర్షం పడే అవకాశం లేదు. కానీ ఐసీసీ ముందుజాగ్రత్తగా రిజర్వ్ డేను కేటాయించింది. ఏదైనా కారణం చేత మార్చి 5న మ్యాచ్ పూర్తి చేయలేకపోతే, మార్చి 6వ తేదీ శుక్రవారం రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది.

  • 05 Mar 2026 05:10 PM (IST)

    IND vs ENG: ఇరుజట్ల రికార్డులు..

    వాంఖడేలో భారత్ ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఐదు గెలిచి, రెండు ఓడిపోయింది. అదే సమయంలో ఇంగ్లాండ్ ఇక్కడ ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడింది. మూడు గెలిచి, మూడు ఓడిపోయింది. ఈ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ రెండుసార్లు తలపడ్డాయి. రెండూ 1-1 తేడాతో గెలిచాయి.

  • 05 Mar 2026 04:59 PM (IST)

    IND vs ENG: బ్యాటర్లదే హవా

    ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మొదటి మూడు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఆ తర్వాత, ఛేజింగ్ జట్లు వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించాయి. చివరి మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జింబాబ్వేను 107 పరుగుల తేడాతో ఓడించింది.

  • 05 Mar 2026 04:45 PM (IST)

    IND vs ENG: టాస్ గెలిస్తే ఉపయోగమా? లేదా?

    ఇక్కడ జరిగిన 16 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, ఛేజింగ్ చేసిన జట్లు ఎనిమిది సార్లు గెలిచాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఎనిమిది సార్లు గెలిచాయి. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 254. ఈ ప్రపంచ కప్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్ చేసింది. ఇక్కడ 32 ఇన్నింగ్స్‌లలో ఆరుసార్లు 200 కంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, 2025లో భారత్‌పై ఇంగ్లాండ్ 97 పరుగులకు ఆలౌట్ అయింది.

  • 05 Mar 2026 04:35 PM (IST)

    IND vs ENG Live Score: బ్యాటర్లకు పండగే

    వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలమైన పిచ్‌గా పేరుగాంచింది. వాతావరణం కూడా స్పష్టంగా ఉండటం వల్ల మంచు కురుస్తుంది. దీని వలన టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

  • 05 Mar 2026 04:26 PM (IST)

    IND vs ENG Live: వాంఖడేలో కీలక పోరు..

    వాంఖడే వేదికగా నేడు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ తలపనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్లు ఫైనల్ చేరుకుంది. ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

Published On - Mar 05,2026 4:25 PM

Follow Us