AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారేడు దళం.. సర్వ రోగాలకు దివ్యౌషధం..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తింటే ప్రయోజనాలు అమోఘం..

మారేడు ఆకులు.. ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో ఉదయాన్నే పరగడుపున ఈ పచ్చి ఆకును తింటే ఈ ప్రయోజనాలు పొందుతారు. మలబద్ధకం లేదా ఉదయం సరిగ్గా కడుపుని ఖాళీ చేయని సందర్భాల్లో తక్షణ ఉపశమనం పొందడంలో మారేడు ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీ పొట్టను శుభ్రపరచడమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మారేడు దళం.. సర్వ రోగాలకు దివ్యౌషధం..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తింటే ప్రయోజనాలు అమోఘం..
Bel Patra
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2024 | 7:36 AM

Share

బిల్వ పత్రం.. మారేడు దళం.. ఆ మహా శివుడికి అత్యంత ప్రితికరమైనది. పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే..చెంబు నీళ్లు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే చాలని భక్తుల విశ్వాసం. ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే ఈ మారేడు దళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మారేడు ఆకులు.. ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో బెల్‌పత్రి తింటే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకుంటే, అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

తరచూ మీకు నోటిపూతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్ పత్రి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు నాలుగు మారేడు ఆకులు తీసుకుని పచ్చిగానే నమిలి తినవచ్చు. అంతేకాదు..మధుమేహం బాధితులకు సైతం ఇది మందుగా పనిచేస్తుంది. బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్‌పత్రిని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తినటం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి బెల్పత్రి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

వేసవిలో ఉదయాన్నే పరగడుపున ఈ పచ్చి ఆకును తింటే ఈ ప్రయోజనాలు పొందుతారు. మలబద్ధకం లేదా ఉదయం సరిగ్గా కడుపుని ఖాళీ చేయని సందర్భాల్లో తక్షణ ఉపశమనం పొందడంలో మారేడు ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీ పొట్టను శుభ్రపరచడమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

బెల్‌ పత్రిని ఎలా తీసుకోవాలి?

– కొన్ని ఆకులను తీసుకుని నీటితో శుభ్రం చేసి వాటిని అలాగే నమిలి తినేయండి.

-లేదంటే మారేడు ఆకులో కాస్త నల్ల ఉప్పు వేసి కొద్దిగా వేడి చేసి తినవచ్చు.

– బేల్‌పత్రిని ఒక గ్లాసు నీటిలో మరిగించి దాని కషాయాన్ని కూడా సేవిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?