AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi: జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం

వారణాశిలోని  జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కీలక తీర్పునిచ్చింది. జ్ఞాన‌వాపి మ‌సీదు ద‌క్షిణ వైపు సెల్లార్‌లో చేస్తున్న పూజ‌ల‌పై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. అంతేకాదు అక్కడ పూజ‌ల‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దక్షిణ భాగంలోని సెల్లార్‌లో చేస్తున్న పూజల వలన ఉత్తర భాగంలోని ముస్లింలు చేసుకునే ప్రార్థనలపై ఎటువంటి ప్రభావం చూపించదని తాము భావిస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Gyanvapi: జ్ఞాన‌వాపి మ‌సీదు సెల్లార్‌లో పూజ‌ల‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. తుది తీర్పు వచ్చే వరకూ ఆంక్షలు అమలు చేయాలని ఆదేశం
Gyanvapi Mosque
Surya Kala
|

Updated on: Apr 02, 2024 | 7:12 AM

Share

కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమ‌వారం కీల‌క తీర్పునిచ్చింది. మసీదులోని సెల్లార్‌లో హిందువుల పూజలు చేసుకోవచ్చన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం, రెండు వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.

దక్షిణ భాగంలోని సెల్లార్‌లో చేస్తున్న పూజల వలన ఉత్తర భాగంలోని ముస్లింలు చేసుకునే ప్రార్థనలపై ఎటువంటి ప్రభావం చూపించదని తాము భావిస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ పద్ధతే సరైనదని, యథాతథ స్థితిలో ఇంకెలాంటి మార్పు రాకూడదంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హిందువులు దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించి సెల్లార్‌లో ప్రార్థనలు చేస్తారని, ముస్లిం ఉత్తరం వైపున ప్రార్థన చేస్తారని కోర్టు తెలిపింది.

జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదం కేసులో చివరి తీర్పు వచ్చే వరకు ఇవే ఆంక్షలు అమలు చేయాలని అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. మసీద్‌ సెల్లార్‌లో పూజలు ఆపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మ‌సీదు ఆవ‌ర‌ణ‌లో హిందువులు పూజ‌లు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి య‌థాత‌థ స్థితిని కొన‌సాగించాల‌ని కోర్టు వెల్లడించింది. ఇక మసీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసేందుకు అనుమ‌తి నిరాక‌రించాల‌న్న మసీదు క‌మిటీ పిటిష‌న్‌ను ఫైన‌ల్‌గా జులైలో విచారిస్తామ‌ని దేశ అత్యున్నత న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. అయితే జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని జనవరి 31వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..