Gold Price Today: తగ్గేదేలే.. రూ.70వేల మార్క్ దాటిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్, సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.70వేలు దాటగా.. వెండి ధర రూ.80వేల మార్క్ దాటింది. పెళ్లిళ్ల సీజన్ పూర్తిగా ప్రారంభం కాలేదు.. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. మున్ముందు ధరలు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు.

Gold Price Today: తగ్గేదేలే.. రూ.70వేల మార్క్ దాటిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Rate
Follow us

|

Updated on: Apr 02, 2024 | 6:28 AM

బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్, సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.70వేలు దాటగా.. వెండి ధర రూ.80వేల మార్క్ దాటింది. పెళ్లిళ్ల సీజన్ పూర్తిగా ప్రారంభం కాలేదు.. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. మున్ముందు ధరలు ఎలా ఉంటాయోనని జనం ఆందోళన చెందుతున్నారు. అయితే, బంగారం, వెండి ధరలు పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ పరిణామాలే కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే.. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే.. అందరూ బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం (2 ఏప్రిల్ 2024) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 10గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,610, 24 క్యారెట్ల ధర రూ.69,390 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,700 ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,760 ఉంటే.. 24 క్యారెట్ల రేట్ రూ.69,540 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు రూ.63,610, 24 క్యారెట్లు రూ.69,390, చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.64,560, 24క్యారెట్ల ధర రూ.70,430, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.63,610, 24క్యారెట్లు రూ.69,390, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,610, 24క్యారెట్ల ధర రూ.69,390 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,700 లుగా ఉంది. ముంబైలో రూ.78,700, బెంగళూరులో రూ.77,600, చెన్నైలో రూ.81,700, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.81,700 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles