ఐడియా అదుర్స్.. స్టూడెంట్స్ అందరూ కలిసి టీచర్ జీతం చెల్లించేందుకు మల్లెపూల సాగు..

విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడినప్పుడు, ఈ పాఠశాల మూతపడకుండా కాపాడే ప్రయత్నంలో గౌరవ ఉపాధ్యాయులను ఆ గ్రామస్థులు నియమించుకున్నారు. అంతేకాదు స్కూల్ గార్డెన్‌లో మల్లెపూలను పెంచి వాటితోనే స్కూల్ టీచర్లకు జీతాలు చెల్లిస్తున్నారు. మొత్తానికి మల్లెల పెంపకం పాఠశాల అభివృద్ధికి దోహదపడింది. అవును  స్కూల్లో ఆవరణలో పెంచే మల్లె సాగుతో పాఠశాల రన్‌ అవుతుంది. మల్లెలు అమ్మగా వచ్చే డబ్బుతో టీచర్స్ కి జీతాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టుమని 10మంది కూడా లేని ఆ స్కూల్‌ స్ట్రేన్త్‌.. ఇప్పుడు 130కి చేరింది.

ఐడియా అదుర్స్.. స్టూడెంట్స్ అందరూ కలిసి టీచర్ జీతం చెల్లించేందుకు మల్లెపూల సాగు..
Jasmine Farming In School
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2024 | 7:32 AM

ప్రభుత్వ గ్రాంట్ కొరత, ఉపాధ్యాయుల కొరతతో చాలా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే దశకు చేరుకున్నాయి. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కొరత వేధిస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విద్యార్థుల సంఖ్య తగ్గినప్పుడు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడినప్పుడు, ఈ పాఠశాల మూతపడకుండా కాపాడే ప్రయత్నంలో గౌరవ ఉపాధ్యాయులను ఆ గ్రామస్థులు నియమించుకున్నారు. అంతేకాదు స్కూల్ గార్డెన్‌లో మల్లెపూలను పెంచి వాటితోనే స్కూల్ టీచర్లకు జీతాలు చెల్లిస్తున్నారు. మొత్తానికి మల్లెల పెంపకం పాఠశాల అభివృద్ధికి దోహదపడింది. అవును  స్కూల్లో ఆవరణలో పెంచే మల్లె సాగుతో పాఠశాల రన్‌ అవుతుంది. మల్లెలు అమ్మగా వచ్చే డబ్బుతో టీచర్స్ కి జీతాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పట్టుమని 10మంది కూడా లేని ఆ స్కూల్‌ స్ట్రేన్త్‌.. ఇప్పుడు 130కి చేరింది. అసలు స్కూల్లో మల్లె సాగు ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

వేసవి కాలం వచ్చేసింది. వేసవి సెలవులు వస్తున్నాయంటే స్టూడెంట్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి, ఏం ఎంజాయ్ చేయాలని పెద్ద లిస్టే రాసుకుంటారు. స్కూల్స్ తెరిచాక తిరిగి క్లాసులకు వెళ్లాంటే ఎంతో బాధ పడిపోతుంటారు. కాని కర్ణాటకలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌ పిల్లల యాటిట్యూడ్ వేరేలా ఉంది. ఇక్కడి స్కూల్ పిల్లలు సమ్మర్‌ వస్తుందంటే హ్యాపిగా ఫీల్‌ అవుతారు. ఎక్కడి ట్రిప్‌లు ప్లాన్ చేయరు. స్కూళ్లో గడపాలను కుంటారే తప్ప.. దూరంగా వెళ్లాలనుకోరు. ఎందుకుంటే మల్లె తోటే ఆధారంగా నడుస్తున్న స్కూలు కోసం వాళ్ల సరదాలను త్యాగం చేస్తారు. మల్లెతోట ద్వారా నడిచే స్కూల్ కోసం కష్టపడతారు పిల్లలు.

మంగళూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓజల ప్రైమరీ స్కూలు పరిసరాలకు వెళితే మల్లె వాసనలు గుబాళిస్తాయి. మల్లె తోటలో బడి ఉందా అనిపిస్తుంటుంది. పదమూడేళ్ల క్రితం ఉన్నట్టుండి విద్యార్థుల సంఖ్య పదికి పడిపోయింది. అంత వరకూ ఐదుగురు టీచర్లు పనిచేసిన చోట ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్క టీచరు కూడా రాకపోతే ఉన్న విద్యార్థులు కూడా చదువు మానేయాల్సొస్తుందనీ గమనించి గ్రామస్తులు స్కూలు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి బడిని బాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

సొంత నిధుల నుంచి జీతమిస్తూ ఇద్దరు కాంట్రాక్ట్‌ టీచర్లని ఏర్పాటు చేశారు. స్కూలు మానేసిన వారిని కూడా తిరిగి చేర్పించి విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వచ్చారు కమిటీ సభ్యులు. భవిష్యత్తులో ఎక్కువ మంది టీచర్లు అవసరపడతారమోనని ముందస్తుగా ఆలోచించి .. మల్లె సాగుని పొత్సహించారు. స్కూల్ ఖాళీ స్థలంలో యాభై మల్లె మొక్కలు నాటారు. అవి ఈరోజు పెద్ద వనంలా తయారైంది.

పండుగలకీ, ప్రత్యేక సందర్భాలకీ స్కూలు నుంచే మల్లె పువ్వులను, పూలజడలూ తీసుకుంటుంటారు చుట్టు పక్కల గ్రామస్తులు. ఆ పువ్వులు అమ్మగా వచ్చిన డబ్బును స్కూల్ పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో జమ చేసి.. వచ్చిన లాభాలతో మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ టీచర్లని నియమించారు ఎస్‌డీసీ సభ్యులు. మిగిలిన డబ్బుని  స్కూల్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. మల్లెసాగుమీద నడిచే ఆస్కూల్‌లో ప్రస్తుతం ఓజల స్కూల్లో 130 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

పాఠశాలలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు పాఠశాల అభివృద్ధి కమిటీ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే దాతల సహకారంతో అదనపు తరగతి గది, స్కూల్  పైకప్పు మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేశారు. రోజురోజుకు పిల్లల సంఖ్య పెరుగుతుండడంతో పాఠశాలకు అదనపు భవనం అవసరం. ప్రభుత్వ గ్రాంటు రాకపోవడంతో పాఠశాల దాతల కోసం వెతుకుతోంది.

విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాటు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA