మరొ కొన్ని గంటల్లో బాలయ్య అఖండ తాండవం చూద్దామనుకున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ షోకు అనుమతి ఇచ్చినా కూడా.. సాంకేతిక సమస్య పెద్ద అడ్డంగా మారింది అఖండ2 షోస్ కి. ఎస్ !" సాంకేతిక సమస్య కారణంగా అఖండ2 ప్రీమియర్స్ షో రద్దు అయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే థియేటర్‌కి చేరుకున్న అభిమానులు ఒక్క సారిగా షాకయ్యారు. తీవ్ర నిరుత్సాహంతో... వెనక్కి వస్తున్నారు. దాంతో పాటే మేకర్స్ పై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు.