AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone: బెంగాల్‌లో తుఫాన్ విధ్వంసం.. పలు ఇళ్లు ధ్వంసం, నేలకూలిన చెట్లు.. 5 మంది మృతి

తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Cyclone: బెంగాల్‌లో తుఫాన్ విధ్వంసం.. పలు ఇళ్లు ధ్వంసం, నేలకూలిన చెట్లు.. 5 మంది మృతి
Cyclone Hit West Bengal
Surya Kala
|

Updated on: Apr 01, 2024 | 7:12 AM

Share

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ ప్రాంతంలో తుఫాను, వర్షం,  వడగళ్ల వాన కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందినట్లు జల్పైగురి ఎస్పీ ధృవీకరించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తుఫాన్ కలిగించిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలోని పలు ప్రాంతాల్లో వర్షం

ఐదుగురు మృతి

ఆదివారం నాడు జల్పైగురిలో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. బలమైన గాలులకు చెట్లు నేలకూలాయి. ఇళ్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది. వడగళ్ల వాన కారణంగా పంటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను తగ్గుముఖం పట్టిన తర్వాత ఎక్కడ చూసినా తుఫాన్ సృష్టించిన విధ్వంసం కనిపిస్తోంది. ప్రజలు తమ ఇళ్ల నుండి విరిగిన వస్తువులను సేకరించడం ప్రారంభించారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తుపాను కారణంగా 5 మంది మృతి చెందినట్లు జల్పైగురి ఎస్పీ ధృవీకరించారు.

ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు జల్పాయిగురి-మైనాగురి ప్రాంతాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రాణనష్టం జరిగింది. పలువురు గాయపడ్డారు, ఇల్లు దెబ్బతిన్నాయి. చెట్లు , విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం

తుపాను కారణంగా సంభవించిన విధ్వంసంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు, క్షతగాత్రులకు తగిన పరిహారం అందజేస్తామని చెప్పారు. మృతుల బంధువులకు, క్షతగాత్రులకు ఎంసీసీ నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం పరిహారం అందజేస్తుందని తెలిపారు. తుఫాను తర్వాత 170 మందికి పైగా రోగులు ఆసుపత్రికి ఎమర్జెన్సీకి వచ్చారని జల్‌పైగురి ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ మరియు వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు. వీరిలో 49 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. అందరూ చికిత్స పొందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..