Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
తగ్గేదేలే.. అంటూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏకంగా 68వేల రూపాయల మార్క్ దాటి 70వేలకు చేరువైంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..
తగ్గేదేలే.. అంటూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏకంగా 68వేల రూపాయల మార్క్ దాటి 70వేలకు చేరువైంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. కొన్నిసార్లు తగ్గుతుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ 1 2024 సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 10గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. దేశీయ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.62,740, 24 క్యారెట్ల ధర రూ.68,440 గా ఉంది. కిలో వెండి ధర రూ.77,900 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,890 ఉండగా.. 24 క్యారెట్లు రూ.68,590 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.62,740, 24 క్యారెట్లు రూ.68,440
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.63,690, 24క్యారెట్లు ధర రూ.69,480
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.62,740, 24క్యారెట్లు రూ.68,440
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.62,740, 24క్యారెట్ల రేట్ రూ.68,440 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,900 గా ఉంది.
ముంబైలో రూ.77,900
బెంగళూరులో రూ.76,900
చెన్నైలో రూ.80,900
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నగరాల్లో రూ.80,900 లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..