దిగి వచ్చిన గ్యాస్ సిలెండర్ ధరలు.. ఏప్రిల్ నెలలో ఎంత చెల్లించాల్సి ఉంటుందంటే

గత ఏడాది కాలంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.250కి పైగా తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గురించి మాట్లాడితే అందులో ఎలాంటి మార్పు లేదు. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలెండర్ ధరలో మార్పు మార్చి 9న జరిగింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించినప్పుడు ఒకసారి... అంతకు ముందు ఆగస్టు 30న గృహ వినియోగదారులకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కోసం ఏప్రిల్ నెలలో ఎంత చెల్లించాల్సి  ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం.. 

దిగి వచ్చిన గ్యాస్ సిలెండర్ ధరలు.. ఏప్రిల్ నెలలో ఎంత చెల్లించాల్సి ఉంటుందంటే
Lpg Cylinder Price
Follow us

|

Updated on: Apr 01, 2024 | 11:24 AM

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది. ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 30 రూపాయలకు పైగా తగ్గింది. కాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను మార్చి నెలలో పెంచారు. అయితే గత ఏడాది కాలంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.250కి పైగా తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర గురించి మాట్లాడితే అందులో ఎలాంటి మార్పు లేదు. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలెండర్ ధరలో మార్పు మార్చి 9న జరిగింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గించినప్పుడు ఒకసారి… అంతకు ముందు ఆగస్టు 30న గృహ వినియోగదారులకు ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. డొమెస్టిక్ గ్యాస్, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కోసం ఏప్రిల్ నెలలో ఎంత చెల్లించాల్సి  ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..

గృహ గ్యాస్ (డొమెస్టిక్ గ్యాస్) సిలిండర్ ధర ఎంత?

  1. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రూ.803కే లభించనుంది. గత ఏడాది కాలంలో రూ.300 తగ్గింది.
  2. కోల్‌కతాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.829లకు లభించనుంది. ఏడాది క్రితం ఈ ధర రూ.1129.
  3. ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.802.50లకు లభించనుంది. ఈ నగరంలో కూడా ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.300 తగ్గింది.
  4. చెన్నైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.818.50లకు పొందవచ్చు. ఏడాది క్రితం ఇక్కడ ధర రూ.1118.50.
  5. ఇవి కూడా చదవండి

చౌకగా లభ్యం కానున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్

  1. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.30.5 తగ్గి రూ.1764.50కి చేరింది. గత ఏడాది నుంచి  రూ.263.5 మేర తగ్గింది
  2. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.32 తగ్గి రూ.1879గా మారింది. గత ఏడాది కాలం నుంచి రూ.221 మేర తగ్గింది.
  3. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.31.5 తగ్గగా.. ప్రస్తుతం ధర రూ.1717.50గా ఉంది. గత ఏడాది కాలం నుంచి రూ.262.5 తగ్గింది.
  4. చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.30.5 తగ్గగా ధర రూ.1930కి చేరింది. గత ఏడాది కాలంలో  రూ.262.5 తగ్గింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..