AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax Seeds: మొటిమలు, మచ్చల నివారణకు, మెరిసే స్కిన్ కోసం అవిసె గింజల మాస్క్‌ని ట్రై చేయండి..

అందరూ అవిసె గింజల రుచిని ఇష్టపడరు. అలాంటి వారు అవిసె గింజల పొడితో సహజమైన ఫేస్ మాస్క్ ను రెడీ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వ్యక్తులు అవిసె గింజలను జుట్టు సంరక్షణలో మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజంగా కాదు.. ఎందుకంటే జుట్టు కోసం మాత్రమే కాదు.. మెరిసే చర్మాన్ని పొందడానికి అవిసె గింజలను కూడా ఉపయోగించవచ్చు. అవిసె గింజలో ఉండే ఫైబర్ చర్మం  వైద్యం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల అవిసె గింజల పొడినికి ఫేస్ కు అప్లై చేయడం వలన స్కిన్ పై వాపు, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం వంటి వాటిని నివారించవచ్చు.

Flax Seeds: మొటిమలు, మచ్చల నివారణకు, మెరిసే స్కిన్ కోసం అవిసె గింజల మాస్క్‌ని ట్రై చేయండి..
Face Mask Made From Flax Seed
Surya Kala
|

Updated on: Apr 01, 2024 | 8:32 AM

Share

అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఒక చెంచా అవిసె గింజలను చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలైన సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. అంతేకాదు ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కూడా అవిసె గింజలు సహాయపడతాయి.

అయితే అందరూ అవిసె గింజల రుచిని ఇష్టపడరు. అలాంటి వారు అవిసె గింజల పొడితో సహజమైన ఫేస్ మాస్క్ ను రెడీ చేసుకోవచ్చు. అయితే చాలా మంది వ్యక్తులు అవిసె గింజలను జుట్టు సంరక్షణలో మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజంగా కాదు.. ఎందుకంటే జుట్టు కోసం మాత్రమే కాదు.. మెరిసే చర్మాన్ని పొందడానికి అవిసె గింజలను కూడా ఉపయోగించవచ్చు. అవిసె గింజలో ఉండే ఫైబర్ చర్మం  వైద్యం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల అవిసె గింజల పొడినికి ఫేస్ కు అప్లై చేయడం వలన స్కిన్ పై వాపు, దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం వంటి వాటిని నివారించవచ్చు. అదే సమయంలో చర్మ కణాలు మరింత మృదుగా మారి అందంగా మెరుపుని సంతరించుకుంటాయి.

చర్మాన్ని బిగుతుగా మార్చడానికి

చర్మాన్ని బిగించడానికి అవిసె గింజలను నీటిలో 3-4 గంటలు నానబెట్టండి. తర్వాత వాటిని ముద్దగా మిక్సీ పట్టి.. తరువాత, ముఖం, మెడను శుభ్ర పరచుకోండి. తర్వాత చర్మంపై ఈ జెల్ ను అప్లై చేయండి. ఒక పొర ఆరిపోయిన తర్వాత.. దాని పై మళ్లీ అప్లై చేయండి. ఈ జెల్ పొర మందంగా మారిన తర్వాత కాసేపు అలాగే ఉంచి  ఆపై ముఖం కడగాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా అవిసె గింజల జెల్ ను అప్లై చేయండి.

ఇవి కూడా చదవండి

మెరిసే చర్మం కోసం

మెరిసే చర్మం కోసం అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. దీని తరువాత మర్నాడు ఉదయం ఇష్కా బ్లూ క్లే , రోజ్ వాటర్‌తో పేస్ ప్యాక్‌ను సిద్ధం చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మెరిసే చర్మం కోసం, వారానికి ఒకసారి ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేయండి.

లోపలి నుండి చర్మాన్ని శుభ్రం చేయడానికి

చర్మం లోపలి నుండి శుభ్రంగా ఉన్నప్పుడే ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది. దీని కోసం ఒక గుడ్డు తెల్లటి సొన లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కలిపి ఫేస్ మాస్క్ సిద్ధం చేయండి. ఇప్పుడు ఈ మాస్క్‌ని ముఖానికి అప్లై చేసి వదిలేయండి. అది ఆరిన తర్వాత నీళ్లతో కడిగేసి కాస్త మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..