చింతపండుతో అనారోగ్య చింతలన్నీ పరార్..! రెగ్యులర్‌గా తింటే బరువు తగ్గి స్లిమ్‌ అవటం ఖాయం..!!

చింతపండు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి. చింతపండు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. శరీరంలోని వాపులకి, నొప్పులకి చింత పండు రసంతో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. చింత పండును తరచూ మలబద్ధకం, జలుబు, ఫ్లూ, జ్వరం, వికారం వంటి రుగ్మతలకు ఉపయోగిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు చింతపండు రసంతో ఇలా చేస్తే..

చింతపండుతో అనారోగ్య చింతలన్నీ పరార్..! రెగ్యులర్‌గా తింటే బరువు తగ్గి స్లిమ్‌ అవటం ఖాయం..!!
Tamarind Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 01, 2024 | 8:01 AM

చింతపండు.. ఈ పేరు వినగానే మనందరికీ నోట్లో నీళ్లు తిరుగుతాయి. తీపి, పుల్లని రుచితో అందరినీ పిచ్చెక్కించే చింతపండు మీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చింతపండుతో చట్నీ, సాంబార్‌, అందరూ ఇష్టంగా తినే గోల్-గప్పా నీటిలో కూడా విరివిగా వాడుతుంటారు. చింతపండు, అనేక యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక బలమైన ప్రయోజనాలను అందిస్తుంది. చింతపండు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్, అమినో యాసిడ్స్ ఉంటాయి. చింతపండు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండు తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా అనేక వంటకాల్లో చింతపండును ఎక్కువగా ఉపయోగిస్తారు. చింత పండును ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత పండులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. చింతపండులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీని గుజ్జులో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి సహజమైన రీతిలో శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. చింతపండు తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. నిత్యం చింతపండు తినే వారి శరీర భాగాలన్నీ సజావుగా పనిచేస్తాయి. ఎవరికైనా ఐరన్ లోపం ఉంటే తప్పనిసరిగా చింతపండు రసం తాగాలి. ఇందులో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది రక్త కణాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. చింతపండు రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. దీనితో పాటు ఫ్రీ రాడికల్స్ సమస్య కూడా దూరమవుతుంది.

చింతపండు రసంలో అనేక రకాల పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది. చింతపండులో ఉండే యాంటీ-హైపర్‌టెన్సివ్ ఎలిమెంట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఆరోగ్య సమస్యలకు దారితీసే ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది. గుండె, కాలేయ సమస్యలను నివారిస్తుంది. వివిధ రకాల కాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచడానికి చింత పండు దివౌషధంగా పనిచేస్తుంది. చింతపండులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చింతపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీంతో పాటు పదే పదే ఆకలిగా అనిపించే సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. శరీరంలోని వాపులకి, నొప్పులకి చింత పండు రసంతో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. చింత పండును తరచూ మలబద్ధకం, జలుబు, ఫ్లూ, జ్వరం, వికారం వంటి రుగ్మతలకు ఉపయోగిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు చింతపండు రసం తీసుకోవాలి. ఇందులో హైడ్రాక్సిల్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించేలా పనిచేస్తుంది. చింతపండు తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. బరువు వేగంగా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..