ఇంత చిన్న వెల్లుల్లి ఏం చేస్తుందనుకుంటే పొరపాటే..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తింటే.. ఎన్నో రోగాలకు దివ్యౌషధం..!!

బరువు తగ్గడానికి వెల్లుల్లి రసాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరంలోని అనవసరమైన క్యాలరీలను కరిగించడంలో ఇవి మేలు చేస్తాయి. వెల్లుల్లి రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే వెల్లుల్లి రసం తాగడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి రసం తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. చర్మ ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి తోడ్పడుతుంది. మొటిమలను, మంటను తగ్గిస్తుంది.

ఇంత చిన్న వెల్లుల్లి ఏం చేస్తుందనుకుంటే పొరపాటే..! ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా తింటే.. ఎన్నో రోగాలకు దివ్యౌషధం..!!
Garlic Juice
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 01, 2024 | 7:23 AM

అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఆహార పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి రసాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగితే ఎన్నో అద్బుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వెల్లుల్లి రసం తాగడం వల్ల పొట్టలోని ఇన్ఫెక్షన్లు, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రసం తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ దీనికి సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెల్లుల్లి రసం తాగాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడి టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. వెల్లుల్లి రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. రోజూ వెల్లుల్లి రసం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి శ్వాసకోశ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ భాగాలు దీనికి సహాయపడతాయి. ఉదయాన్నే వెల్లుల్లి రసాన్ని తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరం అవుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వెల్లుల్లి కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. కాలేయం, మూత్రపిండాలు, రక్తప్రవాహానికి అద్భుతమై డిటాక్స్ ఫైయర్ గా పనిచేస్తుంది. మెదడు పనితీరును రక్షిస్తుంది. జ్ఞాపకశక్తి, దృష్టి మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌ల రిస్క్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి వెల్లుల్లి రసాన్ని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. శరీరంలోని అనవసరమైన క్యాలరీలను కరిగించడంలో ఇవి మేలు చేస్తాయి. వెల్లుల్లి రసం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే వెల్లుల్లి రసం తాగడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వెల్లుల్లి రసం తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. చర్మ ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి తోడ్పడుతుంది. మొటిమలను, మంటను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!