AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌తో ఇట్టే బరువు తగ్గొచ్చు.. అవేంటో ఓ లుక్కేయండి..

అయితే ఒకేసారి బరువు తగ్గడం కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల సహజ పద్ధతులను పాటిస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా బరువు తగ్గించుకోవచ్చు అలాంటి వాటిలో డిటాక్స్‌ డ్రింక్స్‌ ఒకటి. ఈ డ్రింక్స్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను సులభంగా బయటకు తొలగించుకోవచ్చు...

Weight Loss: ఈ డిటాక్స్‌ డ్రింక్స్‌తో ఇట్టే బరువు తగ్గొచ్చు.. అవేంటో ఓ లుక్కేయండి..
Weight Loss
Narender Vaitla
|

Updated on: Mar 31, 2024 | 9:53 PM

Share

అధిక బరువు ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. మారుతోన్న జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఊబకాయం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధిక బరువు మరెన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె జబ్బులు, రక్తపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందుకే పెరిగిన బరువు తగ్గించుకునేందుకు చాలా మంది జిమ్‌ల బాట పడుతున్నారు.

అయితే ఒకేసారి బరువు తగ్గడం కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల సహజ పద్ధతులను పాటిస్తే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా బరువు తగ్గించుకోవచ్చు అలాంటి వాటిలో డిటాక్స్‌ డ్రింక్స్‌ ఒకటి. ఈ డ్రింక్స్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను సులభంగా బయటకు తొలగించుకోవచ్చు. ఇది సులభంగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఆ డిటాక్స్‌ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బరువు తగ్గడానికి బెస్ట్ డిటాక్స్‌ డ్రింక్స్‌లో గ్రీన్‌ టీ ఒకటి. గ్రీన్‌ టీ జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఒత్తిడిని తగ్గించడం ద్వారా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. డిటాక్స్ డ్రింక్‌గా గ్రీన్ టీ తాగడం చాలా ప్రయోజనకరం.

* బీట్‌రూట్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఫైబర్ బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది అలాగే పేగు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు బీట్ రూట్ జ్యూస్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.

* బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మరసం కూడా ఒక బెస్ట్ టిప్‌గా చెప్పొచ్చు. ఇది శరీరాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరంలోని మలినాలు తొలగిపోయి బరువు తగ్గడంలో దోహదపడుతుంది.

* మెంతులు కూడా బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెంతులను నీటిలో వేసి వేడి చేసుకొని తాగితే శరీరం డిటాక్స్‌ అవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.