మసాలా లేకుండా మటన్ కర్రీ.. ఎలా వండాలో తెలుసా?

Samatha

02  march 2026

మటన్ కర్రీ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మంది లొట్టలేసుకొని మరి మటన్ కర్రీ తింటారు.

మటన్ కర్రీ

ఇక మటన్ కర్రీ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది మసాలాలు, మసాలా లేకుండా చాలా వరకు మటన్ కర్రీ వండరు.

మసాలా

కానీ అందరికీ మసాలాల పడవు, కొంత మందికి మసాలా తినడం వలన కడుపు నొప్పి, అల్సర్, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. దీంతో కొదరు మటన్ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపరు.

జీర్ణ సమస్యలు

అయితే మసాలా లేకుండా కూడా మటన్ వండొచ్చు. కాగా, మసాలా లేకుండా మటన్ కర్రీ ఎలా వండటం వలన అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.

మసాలా లేకుండా

కావాల్సిన పదార్థాలు : మటన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి పొడి, రెండు లవంగాలు.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : ముందుగా పాన్ పెట్టి అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, ఉల్లిపాయలు, అల్లం, లవంగాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కలపాలి.

మటన్ కర్రీ తయారీ

అదే విధంగా పచ్చి కొబ్బరి పొడి కూడా వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి, తర్వాత ఇందులో మటన్ వేసి మంచిగా ఫ్రై చేయాలి.

కొబ్బరి పొడి

తర్వాత ఉప్పు, కారం వేసి కాసేపు ఉడకనివ్వాలి. దాదాపు 20 నిమిషాల వరకు కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, పూదీన వేసి ఐదు నిమిషాలు ఉంచాలి.

ఉపు, కారం

అంతే వేడి వేడి మసాలా లేని మటన్ కర్రీ రెడీ.  ఇందులో కొబ్బరి పొడి వేయడం వలన చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.

మటన్ కర్రీ రెడీ