AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు తాగితే ఈ రోగాలన్నీ పరారే..

ఆధునిక జీవనశైలి కారణంగా గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. అయితే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, పసుపుతో తయారుచేసిన కషాయం ఈ సమస్యలకు తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచి, పలు అనారోగ్యాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు తాగితే ఈ రోగాలన్నీ పరారే..
Coriander Water Benefits
Shaik Madar Saheb
|

Updated on: Mar 02, 2026 | 2:54 PM

Share

ప్రస్తుత జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఛాతీలో మంట, పుల్లటి త్రేనుపులు, గొంతులో అడ్డుపడినట్లు ఉండటం వంటివి ఈ సమస్యల సాధారణ లక్షణాలు. ఆహారం జీర్ణాశయంలోకి చేరినప్పుడు ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైకి ఎగదన్నడం వల్ల ఈ మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తరచుగా మందుల వాడకం కంటే, ఆయుర్వేద చిట్కాలను పాటించడం ఉత్తమమని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

మన పూర్వీకులు నమ్మిన ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కా ధనియాల కషాయం. ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు తక్షణ ఉపశమనాన్ని అందించి, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

కషాయం తయారీ విధానం:

ఒక గ్లాసు లేదా అర లీటరు నీటిని తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు లేదా నాలుగు నల్ల మిరియాలు, మూడు లేదా నాలుగు లవంగాలు (లవంగాల మధ్యలో ఉండే పువ్వు తీసివేసి), చిటికెడు పసుపు వేయండి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, నీరు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఆ తర్వాత గోరువెచ్చగా అయ్యాక వడగట్టుకుని తాగండి..

కషాయం ప్రయోజనాలు:

ధనియాలు: ఆయుర్వేదం ప్రకారం ధనియాలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఇవి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చక్కగా పనిచేస్తాయి.

జీలకర్ర: జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మిరియాలు: అజీర్తి సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి, గ్యాస్, ఎసిడిటీకి ఉపశమనం కలిగిస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తికి సహాయపడి, ఆహారం ఎక్కువసేపు జీర్ణాశయంలో నిల్వ ఉండకుండా చేస్తాయి.

లవంగాలు: ఇవి కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కావు, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, విటమిన్ ఎ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

పసుపు: ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి.

డైలీ తాగితే.. ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం:

ఈ కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు:

  • జీర్ణ సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం.
  • గుండె ఆరోగ్యం: రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది.
  • రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • సాధారణ వ్యాధులు: జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం.
  • అంతర్గత శుద్ధి: జీర్ణాశయంలో ఉండే క్రిములు, ఏలిక పాములు వంటివి చనిపోవడానికి సహాయపడుతుంది.
  • మధుమేహం నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
  • శరీర ఉష్ణోగ్రత: ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.
  • థైరాయిడ్ ఆరోగ్యం: థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.

ఈ కషాయాన్ని ఎప్పుడైనా, ఎవరైనా తాగవచ్చు. గ్యాస్ లేదా కడుపు ఉబ్బరంగా అనిపించిన వెంటనే తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే వారానికి కనీసం రెండు రోజులు ఈ కషాయాన్ని తీసుకోవడం మంచిది. దీంతో పాటు, రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలను నివారించవచ్చు. ఈ చిట్కా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us