AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు

చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు. శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

Ugadi 2024: ఉగాది ఉత్సవాలకు ముస్తాబోతున్న శ్రీశైలం.. ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ పెద్దిరాజు
Srisailam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 05, 2024 | 6:00 PM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రియల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. యాంపీథీయేటర్, మల్లమ్మకన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువ పందిర్లు వేశారు. ఆయా చలువ పందిర్లు పరిశీలిస్తూ ఎండ తీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా  ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు.

శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చలువ పందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. మంచినీటిని ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు. ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేలా చూడాలని తెలిపారు. యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు, డివిజన్ల వారిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.  ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధిక రేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..