AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మూడు బర్నర్‌లు ఉన్న గ్యాస్ స్టవ్‌ని ఉపయోగించవచ్చా.. వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే..

ఓ వైఫు పిల్లలను స్కూల్ కు పంపించాలి, మరోవైపు భర్తకు ఆఫీసుకు వెళ్ళడానికి క్యారేజ్ ఇవ్వాలి.. అదే సమయంలో తాను కూడా ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అవ్వాలి.. దీంతో వంట త్వరగా చెయ్యడానికి ఈజీ పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంట చేయడం కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ కు షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు రెండు పొయ్యలు సరిపోవడం లేదు.. ఏకకాలంలో టిఫిన్ , అన్నం, కూరలు చెయ్యాలి కనుక మూడు, నాలుగు బర్నర్ లున్న పొయ్యలను ఉపయోగించి వంట చేయడానికి స్త్రీలు రెడీ అవుతున్నారు.

Vastu Tips: మూడు బర్నర్‌లు ఉన్న గ్యాస్ స్టవ్‌ని ఉపయోగించవచ్చా.. వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందంటే..
3 Burner Gas Stove Vastu Tips
Surya Kala
|

Updated on: Mar 31, 2024 | 7:03 AM

Share

ప్రస్తుతం కాలంతో పోటీ పడుతూ ఉరుకులు, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఓ వైపు ఇల్లాలుగా ఇంటి భాద్యతలను చూసుకుంటూనే మరోవైపు ఉద్యోగిగా తన విధులను నిర్వహిస్తూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అంటే ఉదయం నిద్ర లేచింది మొదలు… రాత్రి నిద్రపోయే వరకూ ఏదొక పని చేస్తూనే ఉంటున్నారు. ఓ వైఫు పిల్లలను స్కూల్ కు పంపించాలి, మరోవైపు భర్తకు ఆఫీసుకు వెళ్ళడానికి క్యారేజ్ ఇవ్వాలి.. అదే సమయంలో తాను కూడా ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అవ్వాలి.. దీంతో వంట త్వరగా చెయ్యడానికి ఈజీ పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంట చేయడం కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ కు షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు రెండు పొయ్యలు సరిపోవడం లేదు.. ఏకకాలంలో టిఫిన్ , అన్నం, కూరలు చెయ్యాలి కనుక మూడు, నాలుగు బర్నర్ లున్న పొయ్యలను ఉపయోగించి వంట చేయడానికి స్త్రీలు రెడీ అవుతున్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని అనుసరిస్తూ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ లేదా నాలుగు బర్నర్ లు ఉన్న స్టౌవ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే హిందూ సనాతన ధర్మంలో వంట చేసే విషయంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఒకే ఇంట్లో మూడు పొయ్యలు పెట్టడం నిషేధం అని బలంగా నమ్ముతారు. దీంతో ఇప్పుడు మూడు బర్నర్ లు ఉన్న స్టౌవ్ లు వాడవద్దు అంటూ కొంత మంది  చెబుతూ ఉంటారు.

అయితే ఇదంతా మూఢ నమ్మకం అని జ్యోతిష్యులు కొట్టి పడేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం మూడు సంఖ్యకు విశిష్ట స్థానం ఉందని.. పూర్వం ఉమ్మడి కుటుంబం విడిపోకుండా కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో మాత్రమే మూడు పొయ్యలు వద్దు ముక్క చెక్కలు అవుతుందని అని చెప్పేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ ని ఇంట్లో ఉపయోగించడం వలన ఎటువంటి కష్ట నష్టాలు రావని అంటున్నారు. మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా మార్పులు సహజమని పూర్వకాలంలోని సంఘటనలను నేటికి అన్వయించుకోకుండా మూడు బర్నర్ లు ఉన్న గ్యాస్ స్టవ్ ని చక్కగా ఉపయోగించుకోవచ్చు అని సూచిస్తున్నారు.

అంతేకాదు కొన్ని ఏళ్ల  క్రితం వరకూ వంట ఇంట్లో ఒక పొయ్యి,  వేడి నీరు పెట్టుకోవడానికి ఆరుబటయ ఒక పొయ్యి ఉండేవి. అయితే ఇపుడు ఇరుకు గదులు కనుక అన్నీ వంట ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయి. అన్నం, పప్పు, టిఫిన్ చేస్తూనే వేడి నీరు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే రెండు బర్నర్ లున్న స్టౌవ్ లు సరిపోవడం లేదు. దీని స్థానంలోచాలా మంది ఇళ్లలో మూడు లేదా నాలుగు బర్నర్ ల స్టౌవ్ లు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు