AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: మరణానంతరం గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి? నియమాలు, కథ, ప్రాముఖ్యత ఏమిటంటే

గరుడ పురాణం ఒక రహస్య గ్రంథం. పఠించే ముందు అనేక విషయాలను గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ పుస్తకం ఇంట్లో సభ్యులు మరణానంతరం చదువుతారు.  కనుక ఈ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోవడం సరికాదు. ఎవరైనా గరుడ పురాణాన్ని పఠించాలనుకుంటే నిర్మలమైన మనస్సుతో చదవాలి. అంతే కాకుండా శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు.

Garuda Puranam: మరణానంతరం గరుడ పురాణాన్ని ఎందుకు చదవాలి? నియమాలు, కథ, ప్రాముఖ్యత ఏమిటంటే
Garuda Puranam
Surya Kala
|

Updated on: Mar 10, 2024 | 12:58 PM

Share

సనాతన ధర్మంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం ముఖ్యమైన గ్రంథం. ఇది ప్రపంచ సృష్టికర్త అయిన విష్ణువు తన భక్తులకు అందించిన జ్ఞానం. మనిషి మరణానంతర పరిస్థితి ఈ పురాణంలో వివరించబడింది. అంతేకాదు మానవుల వివిధ చర్యలకు వేర్వేరు శిక్షలు కూడా గరుడ పురాణంలో పేర్కొనబడ్డాయి. ఈ వ్రతం సాధారణంగా కుటుంబ సభ్యుల మరణానంతరం పఠిస్తారు. దీని ద్వారా ఆత్మకు మోక్షం లభిస్తుంది. ఇల్లు పవిత్రమవుతుందని విశ్వాసం. గరుడ పురాణం గురించిన వివరణాత్మక సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం.

గరుడ పురాణాన్ని ఎప్పుడు, ఎందుకు చదవాలి?

పురాణ గ్రంధాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు. దీంతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది. మరణించినవారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుచేత గరుడ పురాణాన్ని చదవడం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుంది.

గరుడ పురాణం చదవడానికి నియమాలు

గరుడ పురాణం ఒక రహస్య గ్రంథం. పఠించే ముందు అనేక విషయాలను గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ పుస్తకం ఇంట్లో సభ్యులు మరణానంతరం చదువుతారు.  కనుక ఈ గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోవడం సరికాదు. ఎవరైనా గరుడ పురాణాన్ని పఠించాలనుకుంటే నిర్మలమైన మనస్సుతో చదవాలి. అంతే కాకుండా శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు.

ఇవి కూడా చదవండి

గరుడ పురాణం ప్రాముఖ్యత

గరుడ పురాణం 18 మహాపురాణాలలో ఒకటి. ఈ పుస్తకంలో మొత్తం 19 వేల శ్లోకాలు ఉన్నాయి. వీటిలో ఏడు వేల శ్లోకాలు మానవ జీవితానికి సంబంధించినవి. అందులో నరకం, స్వర్గం, రహస్యం, విధానం, మతం, జ్ఞానం ప్రస్తావన ఉంది. ఈ గ్రంధాన్ని పఠించడం వల్ల జ్ఞానం, త్యజించడం, తపస్సు, ఆత్మజ్ఞానం, పుణ్యం అనే జ్ఞానం కలుగుతుంది. ఎవరైనా మరణించిన తర్వాత ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం. అంతే కాకుండా ఇంటి పరిసరాలు కూడా ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి.

గరుడ పురాణ కథ:

గరుడ పురాణంలోని కథనం ప్రకారం ఒక ఋషి శాపం కారణంగా పరీక్షిత్ రాజు నాగలోక రాజు తక్షకుడు కాటు వేశాడు. అనంతరం తక్షకుడు వెళ్తున్న దారిలో అతను కశ్యప మహర్షిని కలుసుకున్నాడు. తక్షకుడు నాగ రాజు నుంచి బ్రహ్మణుడు రూపంలో వేషం మార్చుకుని.. కశ్యప మహర్షితో మాట్లాడుతూ.. ఇలా  అసహనంగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. తక్షక నాగరాజు ..  పరీక్షిత్ రాజుని చంపడానికి కాటు వేశాడు.. అతని విష ప్రభావాన్ని తొలగించి మళ్లీ  పరీక్షిత్ మహారాజుకి ప్రాణం పోస్తానని చెప్పాడు. అది విన్న తక్షకుడు తనను తాను ఆ ఋషికి పరిచయం చేసుకున్నాడు. తన విష ప్రభావం వల్ల ఇప్పటి వరకు ఎవరూ బ్రతకలేక లేదని తక్షకుడు చెప్పాడు. అప్పుడు కశ్యపుడు తన మంత్రాల శక్తితో పరీక్షిత్ రాజు శరీరంలోని విష ప్రభావాన్ని తొలగిస్తానని చెప్పాడు.

అప్పుడు తక్షకుడు కోపంతో ముందు ఈ పచ్చని చెట్టుని కాటు వేస్తా.. మళ్ళీ జీవం పోయామని కశ్యప మహర్షిని కోరాడు. తక్షకుడు చెట్టును కాటు వేసినప్పుడు కశ్యపుడు తన మంత్రంతో ఆ చెట్టుకి మళ్ళీ జీవం పోశాడు.  కొద్దిసేపటికే మాడిపోయిన ఆ చెట్టు నుంచి కొత్త రెమ్మలు చిగురించాయి. కొద్దిసేపటికే చెట్టు మళ్లీ పచ్చగా మారింది. ఋషి కశ్యపు చేసిన ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయిన తక్షకుడు.. రాజుకు ఎందుకు మేలు చేయాలనుకుంటున్నావు అని అడిగితే.. అప్పుడు తాను రాజుని బతికిస్తే భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఋషి చెప్పాడు. అప్పుడు తక్షకుడు ఒక పరిష్కారాన్ని కనిపెట్టి కశ్యపుడు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి అతన్ని వెనక్కి పంపాడు. గరుడ పురాణం ప్రకారం గరుడ పురాణం విన్న తర్వాత కశ్యప ఋషి కి మంత్రం ప్రభావం, శక్తి పెరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు