అంగరంగ వైభవంగా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Mar 10, 2024 | 8:17 PM

మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి.

మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి. రథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు స్థానిక నంద్యాల నుంచే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Mar 10, 2024 07:56 PM