AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Temple: కేదార్‌నాథ్ తలుపు తెరచుకునే ముహర్తం ఖరారు.. 6 నెలల తర్వాత తరువాత శివయ్య దర్శనం ఎప్పుడంటే..

కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే ప్రక్రియ మే 6 నుండి ప్రారంభమవుతుంది. మే 6న శివయ్య విగ్రహం ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి గుప్తకాశీకి చేరుకుంటుంది. మే 7న రాంపూర్ చేరుకున్న తర్వాత  మే 8న గౌరీకుండ్‌లో , మే 9న కేదార్‌నాథ్ కు చేరుకోనుంది. మే 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి బాబా కేదార్‌నాథ్ తలుపులు భక్తుల కోసం తెరవనున్నారు. అయితే మే 12వ తేదీన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి

Kedarnath Temple: కేదార్‌నాథ్ తలుపు తెరచుకునే ముహర్తం ఖరారు.. 6 నెలల తర్వాత తరువాత శివయ్య దర్శనం ఎప్పుడంటే..
Kedarnath Temple
Surya Kala
|

Updated on: Mar 10, 2024 | 10:53 AM

Share

పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 12వ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవడానికి శుభప్రదమైన తేదీని ప్రకటించారు. ప్రతి సంవత్సరం  హిమపాతం కారణంగా కేదార్‌నాథ్ తలుపులు సంవత్సరంలో ఆరు నెలల పాటు మూసివేస్తారు.

కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయంటే

మే 10, శుక్రవారం ఉదయం 7 గంటలకు పూర్తి ఆచారాలతో కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరవబడతాయి. కేధారేశ్వరుడి పంచముఖి భోగ్ విగ్రహం మే 5న పంచకేదార్ గడ్డి సైట్ శ్రీ ఓంకారేశ్వర దేవాలయం ఉఖిమత్‌లో పూజించబడుతుంది. ఈ విగ్రహం వివిధ మార్గాల ద్వారా మే 9 సాయంత్రం కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. మహాశివరాత్రి రోజున ఉఖిమత్‌లోని పంచకేదార్ గడ్డిస్థల్ శ్రీ ఓంకారేశ్వర్ ఆలయంలో చైర్మన్ అజేంద్ర అజయ్ సమక్షంలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ నిర్వహించిన మతపరమైన వేడుకలో ధామ్ తలుపులు తెరిచే తేదీని నిర్ణయించారు.

కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీ – సమయం

కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరిచే ప్రక్రియ మే 6 నుండి ప్రారంభమవుతుంది. మే 6న శివయ్య విగ్రహం ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి గుప్తకాశీకి చేరుకుంటుంది. మే 7న రాంపూర్ చేరుకున్న తర్వాత  మే 8న గౌరీకుండ్‌లో , మే 9న కేదార్‌నాథ్ కు చేరుకోనుంది. మే 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి బాబా కేదార్‌నాథ్ తలుపులు భక్తుల కోసం తెరవనున్నారు. అయితే మే 12వ తేదీన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడానికి అనుకూలమైన సమయం చైత్ర నవరాత్రి, యమునా జయంతి ప్రతిపాదంలో నిర్ణయించబడుతుంది.

ఇవి కూడా చదవండి

అక్షయ తృతీయ నాడు తెరుచుకునే తలుపులు

అక్షయ తృతీయ సందర్భంగా కేదార్ నాథ్ తలుపులు తెరవడానికి ఒక ఆచారం ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి తేదీని అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రతి సంవత్సరం పవిత్రమైన అక్షయ తృతీయ రోజున శివయ్య తలుపులు తెరవబడతాయి.

అన్నా చెల్లల పండగ రోజున తలుపులు మూసివేత

పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత  పాండవులు తమ భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకు చేరుకున్నారు. అక్కడ వారు శివయ్య ఆలయాన్ని నిర్మించారు. దీని తరువాత ఇక్కడ తన పూర్వీకులకు తర్పణం కూడా ఇచ్చారు. దీని తరువాత ధర్మ రాజు స్వర్గాన్ని పొందాడు. పాండవులు తమ పూర్వీకులకు తర్పణం సమర్పించిన రోజు భాయ్ దూజ్ అని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఇప్పటివరకు కేదార్‌నాథ్ తలుపులు కార్తీక మాసంలో అన్నా చెల్లల పండగ ముందు రోజు నుంచి కేధార్ నాథ్ ఆలయం మూసివేస్తారు.

మే 6న డోలీ బయలుదేరుతుంది

కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీని మహాశివరాత్రి నాడు ప్రకటించారు. అలాగే కేదార్ నాథ్ పల్లకి మే 6వ తేదీన ఓంకారేశ్వరాలయం నుండి ఉఖిమఠానికి బయలుదేరుతుంది. కేదార్‌నాథ్ ఆలయాన్ని 3 నవంబర్ 2024న మూసివేయనున్నారు. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే సమయంలో సుదీర్ఘ అధికారిక పూజ జరుగుతుంది. ప్రధాన పూజారి మొదటి ప్రారంభ పూజ చేసిన తర్వాత మాత్రమే యాత్రికులు కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించగలరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..