AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: కరోనా మీద భయంతో ఏకంగా 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి.. ఫలితం చూసి సైంటిస్టుల షాక్

వాస్తవంగా కరోనా ఒకటి, రెండు డోసులు తీసుకున్నవారే సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్న నేపథ్యంలో అతను  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల సార్లకు పైగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పరిశోధన ల బృందం అతనిని పరిశోధించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తల బృందం ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో అనేక ఆసక్తికరమైన ఫలితాలను ప్రచురించింది.

Covid 19: కరోనా మీద భయంతో ఏకంగా  217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి.. ఫలితం చూసి సైంటిస్టుల షాక్
Corona Vaccine
Surya Kala
|

Updated on: Mar 10, 2024 | 9:20 AM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు.. దీనిని నివారణ కోసం ఏమి చెయ్యాలి.. అని వైద్యులు , శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఈ వైరస్ వ్యాప్తి ఆగుతుందని పెద్దగా  ప్రజలు ఆశలు పెట్టుకోలేదు. అయితే శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం లక్షలాది మంది ప్రాణాలను కాపాడడం విశేషం. సాధారణంగా ప్రజలకు రెండు డోస్‌లు మాత్రమే వ్యాక్సిన్‌ ను ఇచ్చారు. అతి కొద్దీ మందికి మాత్రమే బస్టర్ డోసు ఇచ్చారు. అయితే కొంతమంది 10-15 డోస్‌లు తీసుకున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఓ కేసు చర్చనీయాంశమైంది. శాస్త్రవేత్తలను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది.

వాస్తవానికి జర్మన్ శాస్త్రవేత్తల బృందం 62 ఏళ్ల వ్యక్తిని అధ్యయనం చేసింది. అతను ఉద్దేశపూర్వకంగా 29 నెలల్లో 217 కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్‌లను పొందాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే  ఇంత మోతాదులో వ్యాక్సిన్ తీసుకున్నా అతనికి వ్యాక్సిన్‌కు సంబంధించి ఎటువంటి దుష్ప్రభావాలు లేవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతను పూర్తిగా సురక్షితంగా ఉన్నాడు.

జర్మనీలోని మాగ్డెబర్గ్‌కు చెందిన ఈ వ్యక్తి గురించి ఒక వార్తాపత్రిక ద్వారా శాస్త్రవేత్తలు తెలుసుకున్నప్పుడు, వారు అతనిని సంప్రదించారు. యూనివర్శిటీ ఆఫ్ ఎర్లాంజెన్-నూరేమ్‌బెర్గ్ పరిశోధకులు అతనిని అధ్యయనం చేయడం కోసం అడగగా.. అతను తనపై అధ్యయనానికి అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

ఎటువంటి దుష్ప్రభావాలు లేవు

వాస్తవంగా కరోనా ఒకటి, రెండు డోసులు తీసుకున్నవారే సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్న నేపథ్యంలో అతను  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల సార్లకు పైగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పరిశోధన ల బృందం అతనిని పరిశోధించడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం శాస్త్రవేత్తల బృందం ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో అనేక ఆసక్తికరమైన ఫలితాలను ప్రచురించింది. డాక్టర్ కిలియన్ షౌబెర్ మాట్లాడుతూ.. ఈ అసాధారణమైన హైపర్‌ వాక్సినేషన్ వలన వ్యక్తిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.  ఔషధం మంచి స్థాయిలో ఉందని గుర్తించారు.’ వ్యాక్సిన్‌ల సానుకూల ప్రభావాలు మోతాదుల సంఖ్య ద్వారా ప్రభావితం కాదని పరిశోధనలు కూడా చెబుతున్నాయని ఆయన చెప్పారు.

2 సంవత్సరాల క్రితం కూడా చర్చలోకి వచ్చిన ఈ వ్యక్తి

ఆసక్తికరంగా ఈ వ్యక్తి మొదటిసారిగా 2022 సంవత్సరంలో వెలుగులోకి వచ్చాడు. అతను కోవిడ్-19 తనకు సోకనప్పటికీ ఎందుకైనా మంచిదంటూ కనీసం 90 సార్లు టీకాలు తీసుకున్నట్లు వెల్లడింది. వ్యాక్సిన్‌ను నిర్వహిస్తున్న అధికారులు ప్రమాదవశాత్తూ ఒక వ్యక్తికి ఇన్ని మోతాదుల వ్యాక్సిన్‌ను వేసినట్లు అనుమానించినప్పటికీ..  ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఇన్ని మోతాదుల వ్యాక్సిన్‌ను తానే వేసుకున్నట్లు వెల్లడించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..