Miss World Winner: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న చెక్ రిపబ్లిక్ యువతి క్రిస్టినా పిజ్‌కోవా.. సినీ శెట్టి టాప్ 4 నుంచి ఔట్

 71వ మిస్ వరల్డ్ విజేతను ప్రకటించారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోగా, భారతదేశానికి చెందిన సినీ శెట్టి టాప్-4 నుండి నిష్క్రమించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా ఈ ఏడాది అందాల సుందరిగా ఎన్నికైంది. ఈ పోటీలో 120 దేశాల నుండి పార్టిసిపెంట్లు పాల్గొన్నారు. వారిలో క్రిస్టినా పిజ్కోవాకు కిరీటం దక్కింది. ఈ పోటీలో సినీ శెట్టి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆమె టైటిల్ రేసులో చాలా దూరంలో నిలిచింది. టాప్ 8 లో చోటు దక్కించుకుంది. 

Miss World Winner: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న చెక్ రిపబ్లిక్ యువతి క్రిస్టినా పిజ్‌కోవా.. సినీ శెట్టి టాప్ 4 నుంచి ఔట్
71st Miss World Winner Krystyna Pyszková
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2024 | 7:12 AM

ప్రపంచ అందాల సుందరి ఎవరా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 71వ ప్రపంచ సుందరి పేరు వెల్లడైంది. ఈ ఏడాది అందాల పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా గెలుపొందగా, లెబనాన్‌కు చెందిన యాస్మినా ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ వేడుకలో చివరి అంకం.. ముగింపు వేడుక మార్చి 9వ తేదీ (శనివారం) దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేదిక మీద క్రిస్టినాను విజేతగా ప్రకటించారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.

ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కోసం 120 మంది అందాల యువతులు పోటీ పడ్డారు. అందరినీ దాటుకుంటూ  క్రిస్టినా పిజ్కోవా ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకుంది. గత ఏడాది మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచిన పోలాండ్ నివాసి కరోలినా బిలావ్స్కా .. తన కిరీటాన్ని ఈ ఏడాదిలో విజేతగా నిలిచిన క్రిస్టినా పిజ్కోవాకు అందించింది. మిస్ వరల్డ్ గా పట్టాభిషేకం చేసింది.

ఇవి కూడా చదవండి

మిస్ వరల్డ్ (@missworld)  పోస్ట్

View this post on Instagram

A post shared by Miss World (@missworld)

భారత్ కు ప్రాతినిధ్యం వహించిన సినీ శెట్టి కల చెదిరిన వేళ

ఈ  మిస్ వరల్డ్ అందాల పోటీలో భారతదేశం తరపున సినీ శెట్టి పాల్గొన్నారు. ఆమె ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది. వాస్తవానికి.. టాప్-8కి చేరుకోవడంలో విజయం సాధించింది. అయితే టాప్ 4 కంటెస్టెంట్స్  లో సినీ శెట్టికి చోటు దక్కలేదు. దీంతో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునే రేసు నుండి నిష్క్రమించింది. సినీ శెట్టి కర్ణాటకలో పుట్టినా విద్యాభ్యాసం ముంబైలో సాగింది. 2022లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది సినీ శెట్టి.

హోస్ట్ గా కరణ్ జోహార్

ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఈ ఈవెంట్‌ను నిర్వహించగా, 2013లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మేగన్ యంగ్ అతనికి మద్దతుగా నిలిచారు. నేహా కక్కర్, ఆమె సోదరుడు టోనీ కక్కర్ , షాన్ వంటి ప్రముఖ గాయ నీమణులు తమ గాత్రం, అభినయంతో అందాల ప్రదర్శనకు మరింత అందాన్ని  అందించారు. 28 ఏళ్ల తర్వాత భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహించారు. అంతకుముందు 1996 సంవత్సరంలో 46వ ఎడిషన్ భారతదేశంలో నిర్వహించారు. ఈసారి ముంబయి నగరంలో ఈ కార్యక్రమం జరగ్గా.. 28 ఏళ్ల క్రితం బెంగళూరులో జరిగింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..