AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంట పొలాలకు వెళ్లి.. ఇంతకీ ఇంటికి రాని రైతులు.. తీరా చూస్తే, గుండె గుభేల్..!

శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటను రక్షించుకునేందుకు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఒడిసి మండలం నవాబుకోట గ్రామానికి చెందిన రైతు రమణ పొలానికి నీళ్ళు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో మృతి చెందాడు.

పంట పొలాలకు వెళ్లి.. ఇంతకీ ఇంటికి రాని రైతులు.. తీరా చూస్తే, గుండె గుభేల్..!
Sri Sathya Sai District Electric Shock
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 05, 2026 | 7:49 PM

Share

శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటను రక్షించుకునేందుకు పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తిలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్ తో మృతి చెందారు. ఒడిసి మండలం నవాబుకోట గ్రామానికి చెందిన రైతు రమణ పొలానికి నీళ్ళు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ తన వేరుశనగ పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలను అమర్చాడు. అయితే కొన్ని వైర్లు మృతుడు రమణ పొలంలో అలాగే వదిలేయడంతో.. తెల్లవారుజామున పొలానికి వెళ్ళిన రమణకు ఆ విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

పొలానికి వెళ్లిన రమణ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, రమణ విగతజీవిగా పడి ఉన్నాడు. తన పొలం అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలను నిర్లక్ష్యంగా అలాగే వదిలేయడంపై మృతుడి కుటుంబసభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రైతు వెంకటేష్ పై కేసు నమోదు చేశారు.

అటు కదిరిలో కూడా ఓ వ్యక్తి పంట పొలాలకు రక్షణగా వేసిన విద్యుత్ కంచె తగిలి మృతి చెందాడు. నల్ల చెరువు మండలం చెరువు వాండ్లపల్లి శివారు ప్రాంతంలో అర్జున్ రెడ్డి అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఓరువాయి గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి రాత్రి సమయంలో అడవి జంతువుల వేటకు వెళుతుంటాడు. అదే క్రమంలో అడవి జంతువుల వేటకు వెళ్లి పొలానికి వేసిన విద్యుత్ తీగలు, కరెంట్ షాక్ తో అర్జున్ రెడ్డి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా రెండు ఘటనలు అడవి జంతువుల బారి నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు వేసిన విద్యుత్ వైర్లు, మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us