Johnny Lever: ఎన్నో కష్టాలు పడిన నవ్వుల రారాజు జానీ లీవర్.. 13 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై కెళ్లి..

జానీ లీవర్ తన 13 సంవత్సరాల వయస్సులో తన సంపాదన ఇల్లు గడిచేదని చెప్పారు. ఒకవేళ తాను సంపాదించని రోజున ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. తన తండ్రి కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి.. స్నేహితులతో గడిపేవాడు. తండ్రి ప్రవర్తనతో విసుగు చెందడమే కాదు.. కష్టాలను తట్టుకోలేక.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై పడుకున్నానని అప్పటి సంఘటలను గుర్తు చేసుకున్నాడు.

Johnny Lever: ఎన్నో కష్టాలు పడిన నవ్వుల రారాజు జానీ లీవర్.. 13 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై కెళ్లి..
Johny Lever Childhood
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2024 | 9:04 PM

బాలీవుడ్ అత్యుత్తమ హాస్యనటుల జాబితాలో తెరచి చూస్తే ఖచ్చితంగా జానీ లీవర్ పేరు ఉంటుంది. అచ్చ తెలుగు అబ్బాయి జానీ లీవర్ బాలీవుడ్ లో స్టార్ కమెడియన్.. బడాబడా స్టార్స్‌తో కలిసి పనిచేశాడు. నాటి ధర్మేంద్ర నుంచి నేటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరకు అనేకమంది సినీ హీరోల సినిమాల్లో నటించాడు. ‘బాజీగర్‌’, ‘తేజాబ్‌’, ‘ఖిలాడీ’, ‘బాజీగర్‌’, ‘కరణ్‌ అర్జున్‌’, ‘రాజా హిందుస్తానీ’, ‘బాస్‌’, ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’, ‘హౌస్‌ఫుల్‌’ వంటి ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై  తన నటనతో మనల్ని అందరిని నవ్వించే జానీ లీవర్ కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని చీకటి దశ గురించి మాట్లాడాడు. జానీ లీవర్ తన 13 సంవత్సరాల వయస్సులో తన సంపాదన ఇల్లు గడిచేదని చెప్పారు. ఒకవేళ తాను సంపాదించని రోజున ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. తన తండ్రి కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి.. స్నేహితులతో గడిపేవాడు. తండ్రి ప్రవర్తనతో విసుగు చెందడమే కాదు.. కష్టాలను తట్టుకోలేక.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అయితే అప్పుడు తన ముగ్గురు సోదరీమణులు గుర్తుకొచ్చారు. తాను మరణిస్తే.. వారి పరిస్థితి ఏమిటని ఆలోచించి తన నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పాడు.

షారుక్ ఖాన్ పై ప్రశంసలు

దీనితో పాటు అదే ఇంటర్వ్యూలో జానీ లీవర్ బాలీవుడ్ లో అనేక మంది నటీనటులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. షారుక్ ఖాన్ స్టార్ హీరో అవుతారని ఎప్పుడైనా ఊహించారా? అని అడిగిన ప్రశ్నకు జానీ స్పందిస్తూ.. షారుక్‌ను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిగా అభివర్ణిస్తూ .. షారుఖ్ ఖాన్ అంత కష్టపడి పనిచేసే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. తనకు గోవిందంటే తనకిష్టమని చెప్పాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..