Nora Fatehi: ముంబై మెట్రోలో బాహుబలి ‘మనోహరి’ డ్యాన్స్.. హుషారెత్తించేలా నోరా స్టెప్పులు.. వీడియో ఇదిగో

తెలుగులో ఎన్టీఆర్ టెంపర్, ప్రభాస్ బాహుబలి (మనోహరి సాంగ్), రవితేజ కిక్‌2, కల్యాణ్ రామ్ షేర్, వరుణ్ తేజ్ లోఫర్, నాగార్జున ఊపిరి తదితర తెలుగు సినిమాల్లో ఆడి పాడింది నోరా. ఇక సోషల్‌ మీడియాలో ఈ బాలీవుడ్ బ్యూటీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంటుంది.

Nora Fatehi: ముంబై మెట్రోలో బాహుబలి 'మనోహరి' డ్యాన్స్.. హుషారెత్తించేలా నోరా స్టెప్పులు.. వీడియో ఇదిగో
Nora Fatehi Dance
Follow us
Basha Shek

|

Updated on: Mar 10, 2024 | 8:53 AM

బాలీవుడ్ అందాల నోరా ఫ‌తేహికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగానే కాకుండా సూపర్బ్ డ్యాన్సర్ గా ఈ ముద్దుగుమ్మకు మస్త్ పాపులారిటీ ఉంది. కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార. తెలుగులో ఎన్టీఆర్ టెంపర్, ప్రభాస్ బాహుబలి (మనోహరి సాంగ్), రవితేజ కిక్‌2, కల్యాణ్ రామ్ షేర్, వరుణ్ తేజ్ లోఫర్, నాగార్జున ఊపిరి తదితర తెలుగు సినిమాల్లో ఆడి పాడింది నోరా. ఇక సోషల్‌ మీడియాలో ఈ బాలీవుడ్ బ్యూటీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంటుంది. ఇలా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నోరా ఫతేహి తాజాగా మెట్రోలో డ్యాన్స్ చేసింది. ప్రతీక్ గాంధీ, దివ్యేందు శర్మ, నోరా, అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మడ్ గావ్ ఎక్స్ ప్రెస్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్లలో బిజిబిజీగా ఉంటోందీ చిత్ర బృందం.

తాజాగా మడ్‌గావ్ ఎక్స్ ప్రెస్ ప్రమోషన్లలో భాగంగా ముంబై మెట్రోలో ప్రయాణించింది నోరా ఫతేహి. అంతేకాదు అక్కడున్న ప్రయాణికులతో సరదాగా డ్యాన్స్ చేసింది. మడ్ గావ్ ఎక్స్ ప్రెస్ సినిమాలోని ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ హుషారెక్కించే స్టెప్పులు వేసి ప్యాసింజర్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ఆమెతో పాటు తోటీ నటీనటులు కూడా నోరాతో కాలు కదపడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నోరాను ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై మెట్రోలో ఇలాంటి డ్యాన్స్ లు చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోరా డ్యాన్స్ వీడియోలు ఇదిగో..

నెటిజన్ల క్రేజీ కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం