AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Valentine OTT: ఓటీటీలోకి ‘ఆప‌రేష‌న్ వాలెంటైన్’ వ‌రుణ్ తేజ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పడు, ఎక్కడంటే?

గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయిక. టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజైంది.

Operation Valentine OTT: ఓటీటీలోకి 'ఆప‌రేష‌న్ వాలెంటైన్'  వ‌రుణ్ తేజ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పడు, ఎక్కడంటే?
Operation Valentine Movie
Basha Shek
|

Updated on: Mar 09, 2024 | 11:29 AM

Share

గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయిక. శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో నవదీప్, రుహానీ శర్మ, అభినవ్‌ గోమటం, అలీ రెజా, సంపత్ రాజ్‌, షతాప్‌ ఫిగర్‌, శుభశ్రీ, లహరి శేరి, స్వేత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తిని రేకెత్తించిన ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజైంది. అయితే కథ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, కొన్ని నెలల ముందు ఇదే స్టోరీతో హృతిక్ రోష‌న్ ఫైట‌ర్‌ సినిమా రావడంతో జనాలు పెద్దగా వరుణ్ తేజ్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే వచ్చాయి. అయితే పుల్వామా అటాక్స్ కు ప్రతీకారంగా ఎయిర్ స్ట్రైక్ సీన్స్, విజువల్స్, బీజీఎమ్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అలాగే VFX కూడా సినిమాకు ప్లస్ గా నిలిచింది. మొత్తానికి థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది ఆపరేషన్ వాలంటైన్‌. దీంతో ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీ నెలలోపే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వరుణ్ తేజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, హిందీ భాష‌లతో పాటు ఇతర దక్షిణాది లాంగ్వెజెస్ లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంద‌ని టాక్ నడుస్తోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించారు. అలాగే బీజీఎమ్ కూడా హైలెట్ గా నిలిచింది. థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్.. త్వరలోనే అఫీషియల్ డేట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!